మేమేం అజేయులం కాదు.. రోహిత్ కీలక వ్యాఖ్యలు?

praveen
భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియా, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ నేటి నుంచి ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. మొదటి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరగబోతుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. టీమ్ ఇండియా లాంటి పటిష్టమైన జట్టును అటు సొంత గడ్డపై ఓడించడం అంత సులభమైన విషయం కాదు. ఎలాంటి టీం అయినా సరే సొంతగడ్డపై టీమ్ ఇండియాఆట తీరు ముందు చేతులెత్తేయాల్సిందే.

 అదే సమయంలో గత కొంతకాలం నుంచి టెస్ట్ క్రికెట్లో ఎటాకింగ్ గేమ్ ఆడుతూ ప్రత్యర్థులపై ఫైచేయి సాధిస్తున్న ఇంగ్లాండు జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. అయితే వరల్డ్ క్రికెట్లో రెండు అగ్రశ్రేణి టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగుతూ ఉండడంతో.. ఇక హోరాహోరీ సమరం జరగడం ఖాయమని అందరూ భావిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో టెస్ట్ సిరీస్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే భారత జట్టు గత 12 ఏళ్లుగా సొంత గడ్డపై ఒక్క టెస్టు సిరీస్ కూడా ఓడిపోలేదు. దీంతో ఇక అదే పరంపరను రిపీట్ చేస్తూ ఈసారి కూడా ఇంగ్లాండ్ ఫై భారత జట్టు టెస్టు సిరీస్ లో విజయం సాధించడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

 అయితే ఇదే విషయం గురించి ఇటీవల స్పందించిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మేము అజేయులమని మమ్మల్ని ఎవరూ ఓడించలేరు అని నేను ఎప్పుడూ అనుకోవట్లేదు. ఇంగ్లాండ్ పై గెలవాలి అంటే తప్పకుండా మంచి క్రికెట్ ఆడాల్సిందే. ఇక నా ఫోకస్ అంతా కూడా మన జట్టు స్ట్రాటజీస్ పైనే ఉంటుంది అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా చివరగా 2012లో కుక్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు అటు ఇండియా పర్యటనకు వచ్చి భారత్ ను టెస్ట్ సిరీస్ లో ఓడించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతమంది కెప్టెన్లు మారినా అటు భారత జట్టు మాత్రం ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ లో ఓటమిపాలు కాలేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: