మరికొద్ది గంటల్లో అఖండ 2 రిలీజ్..బాలయ్య ఫ్యాన్స్ న్యూ డిమాండ్..!

Thota Jaya Madhuri
కొద్ది గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, నందమూరి బాలకృష్ణ అభిమానుల్లో ఉత్సాహం చెప్పలేనంతగా ఉంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆ ప్రత్యేక క్షణం—‘అఖండ 2’ గ్రాండ్ రిలీజ్—ఇప్పుడే రాబోతుంది. ఇంకా కొద్ది సేపట్లోనే ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో అద్భుతమైన హంగామాతో ప్రేక్షకులను పలకరించబోతోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉండి ఉంటే, ఈ సినిమా ఇప్పటికే డిసెంబర్ 5వ తేదీనే ప్రేక్షకుల ముందుకు వచ్చేసి, బాక్సాఫీస్ వద్ద ఒక భారీ సంచలన విజయాన్ని నమోదు చేసి ఉండేదని బాలయ్య ఫ్యాన్స్ బాగా నమ్ముతున్నారు. కానీ మధ్యలో ఊహించని కొన్ని సాంకేతిక సమస్యలు, విడుదలకు సంబంధించిన కొంతమంది ఎత్తిన అడ్డంకులు కారణంగా, అనుకున్న తేదీన ఈ భారీ చిత్రం థియేటర్లలోకి రాలేకపోయింది. అయితే అభిమానుల ఆట్ర్త ని అర్థం చేసుకున్న మేకర్స్ అన్ని చిక్కులను త్వరగానే పరిష్కరించి, సినిమాను మరింత గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే ప్రీమియర్లు మొదలుకానుండటంతో, బాలయ్య అభిమానుల్లో ఉత్సాహం పీక్స్  కి చేరింది.



ఇక సోషల్ మీడియాలో అయితే పరిస్థితి మరింత ఆసక్తికరంగా ఉంది. బాలయ్య ఫ్యాన్స్ అందరూ ఒక్కటై, వేడుకల మూడ్‌లో ముంచెత్తుతున్నారు. “జై బాలయ్య… జై జై బాలయ్య…” అంటూ ట్రెండ్స్ ఊపందుకుంటూ, ఫ్యాన్స్ అందరూ తమ డిస్‌ప్లే పిక్చర్స్‌ ను అఖండ పోస్టర్లతో మార్చుకుంటున్నారు. స్టేటస్‌లు, రీల్స్‌, స్పెషల్ ఎడిట్స్‌, ట్యాగ్‌లైన్‌లు—అన్నింటితోనూ సోషల్ మీడియా ఒక రంగురంగుల వేడుకలా మారింది. బాలయ్య అభిమానులంటే ఎప్పుడు హంగామా అంతే… ఆ స్టైల్ మళ్లీ స్పష్టంగా కనిపిస్తోంది.రిలీజ్ వాయిదా పడిన సినిమా ఇలా మరింత భారీ హైప్‌ను సంపాదించడం నిజంగా ప్రత్యేకమైన విషయం.

 

బాలయ్య మార్కెట్, ఆయన మాస్ పుల్ ఇంకా ఎక్కడికి చేరిందో దీనివల్ల స్పష్టమవుతోంది. ముఖ్యంగా ‘అఖండ’ మొదటి భాగం సూపర్ సక్సెస్ కావడంతో, ఈ సీక్వెల్‌పై ఉన్న అంచనాలు ఆకాశాన్ని అంటాయి.ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే—“అఖండ 2 ఫస్ట్ డే ఫుల్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది?”..“ఎంత వసూళ్లు రాబోతున్నాయి?”ఫ్యాన్స్ మాత్రం ఒక్క మాటే అంటున్నారు—ఈసారి బాక్సాఫీస్ వద్ద అఖండ స్థాయి కాదు… అఖండాకి డబుల్ స్థాయి రికార్డులు చూడబోతున్నాం అని! కొన్ని గంటల్లోనే అఖండ విరుచుకుపడబోతోంది. మరి చూడాలి… ఫస్ట్ డే, ఫస్ట్ షో నుంచి బాలయ్య ఏ స్థాయి దుమ్మురేపుతాడో!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: