ఏం కొట్టాడబ్బా.. 41 బంతుల్లోనే?

praveen
ఇటీవల కాలంలో అంతర్జాతీయ టి20 మ్యాచ్ల కంటే అటు ఆయా దేశాల క్రికెట్ బోర్డులు నిర్వహిస్తున్న టి20 టోర్నీ లకే ఎక్కువగా గుర్తింపు ఉంది అన్న విషయం తెలిసిందే   అయితే బిసిసిఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహా లోనే అటు అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా టి20 టోర్ని నిర్వహిస్తూ ఉండడంతో సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు సౌత్ ఆఫ్రికా t20 టోర్నీ అని ఒక పొట్టి ఫార్మాట్ టోర్నీ నిర్వహిస్తూ ఉంటుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఇక ఈ టోర్నీలో భాగస్వామ్యం అవుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.

 అయితే అంతర్జాతీయ క్రికెట్లో సౌత్ ఆఫ్రికా పిచ్ లపై పెద్దగా రాణించలేక విఫలమయ్యే ఆటగాళ్ళు ఈ టి20 లో మాత్రం అద్భుతంగా రాణిస్తూ ఎన్నో రికార్డులు కొల్లగొడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఐపీఎల్ తరహా లోనే సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో కూడా ప్రేక్షకులు అందరికీ కావలసిన ఉరుములు మెరుపులు కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే ఇటీవల సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లో భాగంగా ఒక ప్లేయర్ ఏకంగా విధ్వంసకరమైన శతకంతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. కేవలం 41 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు.

 ఈ టోర్నీలో ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్ విల్ జాక్స్ తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించాడు. డర్బన్ సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్లో కేవలం 41 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఇక అతని ఇన్నింగ్స్ లో ఎనిమిది ఫోర్లు తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి అని చెప్పాలి. బౌలర్లు అతని వికెట్ తీసుకునేందుకు ఎంత కష్టపడినప్పటికీ అతను మాత్రం వీర విహారం చేశాడు. ఇక టి20 క్రికెట్ లో అతడికి ఇది రెండో సెంచరీ కావడం గమనార్హం. 2024 ఐపీఎల్ లో అతను ఆర్సిబి తరఫున ఆడబోతున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: