ధోనిపై పరువు నష్టం దావా.. ఇంతకీ వేసింది ఎవరో తెలుసా?

praveen
టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అందరూ క్రికెటర్ల లాగా ధోని సోషల్ మీడియాలో ఎప్పుడు పోస్టులు పెట్టడం చేయడు.. ఒకవేళ వచ్చిన ఎప్పుడో ఒకసారి మాత్రమే ధోని సోషల్ మీడియా ఖాతాల నుంచి పోస్టులు రావడం చూస్తూ ఉంటాం. కానీ ఇక అతనికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉంటుంది. ఇలాంటి వార్త ఏదైన ఇంటర్నెట్ లోకి వచ్చిన అది చక్కర్లు కొడుతూ ఉంటుంది అని చెప్పాలి.

 అయితే ఇక ఇప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పై పరువు నష్టం దావా వేశారు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఢిల్లీ హైకోర్టులో ఇలా పరువు నష్టం దావా దాఖలు అయింది అన్నది తెలుస్తుంది. ధోని మాజీ బిజినెస్ పార్ట్ నర్స్ అయినా మెహిర్ దివాకర్, అతని భార్య సౌమ్యదాస్ ఇలా పరువు నష్టం దావా వేశారు అనేది తెలుస్తుంది. అసత్య ఆరోపణలు చేసిన ధోని పరువుకు భంగం కలిగించాడు అంటూ ఈ దంపతులు కోర్టును ఆశ్రయించారు. ధోని పై మాత్రమే కాదు తమకు వ్యతిరేకంగా పోస్టులకు అనుమతించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా ఎక్స్, గూగుల్, ఫేస్బుక్ల లు.  అసత్య కథనాలను ప్రొడ్యూస్ చేసిన న్యూస్ ఫ్లాట్ ఫార్మ్స్ పై కూడా పరువు నష్టం దావా వేయడం గమనార్హం.

 కాగా గతంలో మహీర్ దివాకర్, సౌమ్యదాస్ ధోనిలు భాగస్వాములుగా ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ పేరిట దేశవ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ప్రారంభించారు. అయితే 2016లో సదరు సంస్థ ధోనితో ఒప్పందం చేసుకుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఆర్కా స్పోర్ట్స్ ఫ్రాంచైజీ ఫీజులు లాభాల్లో వాటను మహికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒప్పందంలో షరతులను పాటించడంలో సదురు కంపెనీ విఫలమైంది. ఈ విషయంలో తన భాగస్వాములతో ధోని చర్చించిన ఫలితం లేకపోవడంతో.. అతను అగ్రిమెంట్ రద్దు చేసుకున్నాడు. తర్వాత లీగల్ నోటీసులు కూడా పంపించాడు. అయినప్పటికీ ఆర్కా స్పోర్ట్స్ కంపెనీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇటీవల ధోని కోర్టును ఆశ్రయించాడు. దీంతో 15 కోట్ల మేర తనను మోసం చేశారంట కేసు వేయగా.. ఇక ఇప్పుడు ధోనిపై పరువు నష్టం దావా వేశారు ఆర్కా స్పోర్ట్స్ ను నడిపిస్తున్న ఇద్దరు దంపతులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: