ఇతను మామూలోడు కాదు.. 55 గంటలు ఆ పని చేసి గిన్నిస్ రికార్డ్?

praveen
సాధారణంగా ఈ భూమి మీద ఉండే మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. కొంతమందికి మంచి ఉద్యోగం సంపాదించాలని.. ఇంకొంతమందికి పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించాలని.. మరికొంతమందికి ఇక వ్యాపారంలో దూసుకుపోవాలని.. ఇంకొంతమందికి ఇక సినిమాల్లో హీరో కావాలని.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. ఇలాగే కొంతమందికి ప్రపంచ రికార్డులు సాధించాలని పిచ్చి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇలాంటి రికార్డులను సాధించేందుకు ఏకంగా ప్రాణాలను పెట్టడానికి కూడా చాలా మంది సిద్ధపడుతూ ఉంటారు. వరల్డ్ రికార్డుల కోసం ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి.

 అదే సమయంలో ఇటీవల కాలంలో కొంతమంది వ్యక్తులు మరింత కొత్తగా ఆలోచించి రోజు చేసే పనులనే కాస్త కొత్తగా ఎవరికి సాధ్యం కాని రీతిలో చేసి చివరికి ఇక ప్రపంచ రికార్డులు కొట్టడం చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది ప్రపంచ రికార్డుల కోసం ఒకే విషయంపై ఏళ్ల తరబడి సాధన చేసి ఎవరు చేయలేని విధంగా ఒక పనిని చేసి ఇక వరల్డ్ రికార్డును సృష్టిస్తూ ఉంటారు. ఇటీవల ఏకంగా పంచింగ్ బ్యాగ్ పై పంచులు వేసి ఇలాగే గిన్నిస్ రికార్డు సృష్టించాడు ఒక వ్యక్తి.

 పంచింగ్ బ్యాగ్ పై పంచులు చేయడమా.. అది మేము కూడా చేస్తాం కదా అంటారా.. అయితే అతను ఏకంగా పంచింగ్ బ్యాక్ పై 55 గంటల 15 నిమిషాల పాటు పంచులు వేసి ఈ రికార్డు సాధించాడు. మహారాష్ట్రకు చెందిన మార్షల్ ఆర్టిస్ట్ సిద్దు క్షేత్రి గిన్నిస్ రికార్డు సాధించాడు. నిబంధనల ప్రకారం రెండు సెకండ్లకు ఒక పంచ్ చొప్పున వేశాడు  గంటకు ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోవచ్చు  ఈయన గతంలో రెండు గిన్నిస్ రికార్డును సృష్టించాడు. 2013లో ఒంటికాలతో మూడు నిమిషాల్లో 620 కిక్స్, 2011లో నిమిషాల్లో 168 కిక్స్ ఇచ్చి వరల్డ్ రికార్డులు క్రియేట్ చేశాడు. ఇక 25 ఏళ్లుగా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: