కోహ్లీ, రోహిత్ కు.. కొత్త బాధ్యతలు అప్పగించిన బీసీసీఐ?
కేవలం ఒకటిన్నర రోజుల వ్యవధిలోనే ఈ టెస్ట్ మ్యాచ్ ముగియగా.. ఇదే విషయంపై చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడూ జనవరి 11వ తేదీ నుంచి స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే మూడు టి20 మ్యాచ్ల సిరీస్ కోసం సిద్ధమవుతుంది టీమిండియా. అయితే ఇక ఆఫ్ఘనిస్తాన్ బలమైన ప్రత్యర్థి కాకపోయినప్పటికీ ఈ టి20 సిరీస్ భారత జట్టుకు ఎంతో కీలకం అవుతుంది. ఎందుకంటే టి20 ప్రపంచ కప్ కి ముందు భారత్ తలపడే ఆఖరి t20 సిరీస్ ఇదే కావడం గమనార్హం. కాగా 2024 t20 వరల్డ్ కప్ కోసం వెస్టిండీస్ అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.
జూన్ 1వ తేదీ నుంచి టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయాన్ని ఇటీవల అఫీషియల్ గా ప్రకటించింది ఐసిసి. అయితే ఆఫ్గనిస్తాన్ సిరీస్ పై ఆసక్తిని పెంచే మరో వార్త ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇక ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా ఆడబోతున్నారట. అయితే ఇద్దరు సీనియర్ ప్లేయర్లు పొట్టి ఫార్మాట్ కు దూరమై దాదాపు 14 నెలలు దాటింది. చివరిగా 2022 t20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఆడగా.. ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక ఇప్పుడు వీరిని మళ్లీ తిరిగి జట్టులోకి తీసుకురావాలని బీసీసీఐ భావిస్తుంది. ఇక ఇద్దరి ప్లేయర్ల అభిప్రాయం తెలుసుకునేందుకు సెలెక్టర్లు దక్షిణాఫ్రికా వెళ్ళగా.. ఇక వరల్డ్ కప్ లో పాల్గొనడానికి కోహ్లీ, రోహిత్ ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్ గెలిచి పెట్టే బాధ్యతను ఈ ఇద్దరు సీనియర్లకు అప్పగించిందట బీసీసీఐ.