ఐపీఎల్ లో వచ్చిన డబ్బులతో.. సొంత ఇల్లు కొనుక్కుంటా : శుభమ్

praveen
బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకం గా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది ఎంతో మంది యువ ఆటగాళ్ల పాలిట వరంలా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అప్పటివరకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ కష్టాలు కడలిలో క్రికెట్ కెరీర్ను కొనసాగించిన ఆటగాళ్లకు.. ఐపీఎల్ వేలంలో కోట్ల రూపాయలు ధర పలుకుతున్నారు. ఈ క్రమంలోనే ఆయా ఆటగాళ్ల జీవితం ఒక్కసారిగా మారిపోతూ ఉంటుంది .

 ఇలా ఐపిఎల్ ద్వారా వచ్చిన డబ్బులతో ఇక కెరియర్ను సాఫీగా సాగించడమే కాకుండా కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు ఎంతోమంది యువ ఆటగాళ్లు. అయితే గత కొన్ని సీజన్స్ నుంచి అన్ని ఫ్రాంచైజీలు కూడా యువ ఆటగాళ్లకే పెద్ద పీట వేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇక ఇటీవలే 2024 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి జరిగిన మినీ వేలంలో కూడా కొంతమంది అన్ క్యాప్డ్ ప్లేయర్లకు ఫ్రాంచైజీలు కోట్ల రూపాయల ధర పెట్టి మరి జట్టులోకి తీసుకున్నాయి.

 ఈ క్రమంలోనే యువ ఆటగాడు శుభం దూబేని రాజస్థాన్ రాయల్స్ జట్టు కొనుగోలు చేసింది. ఏకంగా ఈ అన్ క్యాప్డ్ ప్లేయర్ ను 5.60 కోట్లు పెట్టి మరి ఇతర ఫ్రాంచైజీలతో  పోటీపడి జట్టులోకి తీసుకుంది. అయితే ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బులతో మా కుటుంబం కోసం ఇల్లు కొంటాను అంటూ చెప్పుకొచ్చాడు ఈ యువ అటుగాడు. కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని.. ఒకప్పుడు క్రికెట్ కిట్ కొనడానికి కూడా డబ్బుల్లేవు. పాన్ షాప్ నడుపుతు నాన్న చాలా కష్టపడ్డారు. ఇకనైనా మా కుటుంబం సంతోషంగా ఉండాలి. అందుకే సొంత ఇల్లు కొనుక్కుంటా అంటూ చెప్పుకొచ్చాడు . ఇతనొక్కడే కాదు ఇతనిల పేదరికంలో ఉన్న ఎంతోమంది యంగ్ క్రికెటర్స్ కి ఐపీఎల్ కోటీశ్వరులను చేస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: