2024 ఐపీఎల్.. ప్రారంభం ఎప్పుడంటే?

praveen
ప్రస్తుతం భారత్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ హడావిడి మొదలైంది అన్న విషయం తెలిసిందే. సాదరణంగానే ప్రతి ఐపీఎల్ సీజన్ సమయంలో కూడా ఇండియాలో క్రికెట్ పండగ మొదలవుతూ ఉంటుంది. ఇక ఐపీఎల్ జరిగినన్ని రోజులు కూడా అసలు సిసలైన క్రికెట్ మేనీయాని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇక ఈ టోర్నీ జరిగినన్ని రోజులు కూడా ఎక్కడ చూసినా పండగ వాతావరణమే ఉంటుంది అని చెప్పాలి. ఇక ఈ ఏడాది ఎప్పటిలాగానే ఐపీఎల్ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచింది. ఇక ఇప్పుడు 2024 ఐపీఎల్ సీజన్ కోసం సన్నాహాలు మొదలుపెట్టింది బీసీసీఐ.

 కాగా నేడు మినీ వేలం ప్రక్రియ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ వేలానికి ముందే ఎన్నో టీమ్స్ ఐపీఎల్ ట్రేడింగ్ ద్వారా ఇతర టీమ్స్ లోని ఆటగాళ్లను తమ జట్టులో చేర్చుకున్నాయి. ఇక నేడు జరగబోయే మినీ వేలంలో ఏ ఆటగాడు అత్యధిక ధర పలకబోతున్నాడు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. ఇక అన్ని జట్లు కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నయి అని చెప్పాలి. అయితే ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభం కాబోతుంది అని తెలుసుకోవడానికి.. అటు ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.

 కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ వచ్చే ఏడాది మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నట్లు ఒక క్రీడా ఛానల్ తెలిపింది. దీనిపై ఇక త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే సుమారు రెండు నెలల పాటు మ్యాచ్ లు జరగబోతున్నాయట. ఇప్పటికే గుజరాత్, ముంబై జట్లు కొత్త కెప్టెన్ ను ప్రకటించాయి. మరికొన్ని జట్లు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈరోజు మినీ వేలం జరుగుతున్న నేపథ్యంలో కొని జట్లు ఏకంగా కెప్టెన్గా చేయాలి అనుకున్న ఆటగాళ్లను టీం లోకి తీసుకొని వారి చేతిలో సారధ్య బాధ్యతలు పెట్టే అవకాశం ఉంది. ఇక గత సీజన్ లాగానే ఈ సీజన్ లో కూడా పది టీమ్స్ అటు ఐపిఎల్ లో పాల్గొనబోతున్నాయి అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: