ఎందుకు ఆ వీడియోనే.. వైరల్ చేస్తారు : గంభీర్

praveen
టీమిండియా డేర్ అండ్ డాషింగ్ మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే క్రికెటర్ గా భారత జట్టులో కొనసాగిన సమయంలో అతను సాధించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. ఎప్పుడు అద్భుతమైన ఆటతీరుతో భారత జట్టు విజయాలలో కీలక పాత్ర వహించేవాడు గౌతం గంభీర్. ఏకంగా దూకుడు అయిన ఆటతీరుతో ప్రత్యర్థికి ముచ్చమటలు పట్టించేవాడు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ గంభీర్ ఇక వ్యాఖ్యాతగా కొనసాగుతూ ఉన్నారు.



 ఒకవైపు రాజకీయాల్లో కూడా ఎంపీగా గెలిచి ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడుగా కూడా ఉన్నాడు గంభీర్. అయితే గంభీర్ ఎప్పుడు ఎంతో దూకుడుగానే వ్యవహరిస్తూ ఉంటాడు. ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటి దూకుడే ఇక అతనికి ఎన్నో వివాదాలుకు కారణమైంది. ఇలా క్రికెట్ తో ఎలా అయితే అతను హాట్ టాపిక్ గా మారిపోయాడో.. వివాదాలతోనూ ఎక్కువగా వార్తల్లో నిలిచేవాడు. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెటర్లతో గొడవ పడటం అంటే అతనికి మహా ఇష్టం. ఈ క్రమంలోనే గౌతమ్ గంభీర్ తన కెరియర్ లో ఎంతోమంది పాక్ క్రికెటర్లతో గొడవపడ్డాడు.


 ఇలాంటి గొడవలలో అటు పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహీద్ ఆఫ్రిదితో గంభీర్ పడిన గొడవ మాత్రం బాగా ప్రాచుర్యం పొందింది. 2009లో కాన్పూర్ లో జరిగిన ఒక వన్డే మ్యాచ్ సందర్భంగా వివాదం చోటుచేసుకుంది. అయితే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరిగిన కూడా.. ఇక ఈ గొడవకు సంబంధించిన వీడియోనే ఎక్కువగా తెరమీదకి వస్తూ ఉంటుంది అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరిగిన ఆ వీడియోనే ఎందుకు చూపిస్తారు అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఆ ఘటనను  తాను వదిలేసానని.. మీడియో కూడా ఆ విషయాన్ని వదిలేసి.. పాకిస్తాన్ పై ఇండియా సాధించిన విజయాలను చూపించాలి అంటూ గౌతమ్ గంభీర్ సూచించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: