ఆస్ట్రేలియాతో అంత తేలికేం కాదు.. రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
వరల్డ్ కప్ తుది సమరానికి సమయం ఆసన్నమైంది ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఇక నేడు ఫైనల్ మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఈ క్రమంలోనే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఇప్పటికే అంత సిద్ధమైంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం.. ఇక ఈ మహాసంగ్రామానికి ఆతిథ్యం ఇస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతిరథ మహారథుల మధ్య ఇక ఈ ఫైనల్ పోరు జరగబోతుంది.

 అయితే ఇక ఇరు జట్లు కూడా పైనలో గెలిచి టైటిల్ విజేతగా నిలవడమే లక్ష్యంగా ఇప్పటికే అస్త్ర శస్త్రాలను కూడా సిద్ధం చేసుకున్నాయ్ అని చెప్పాలి. ఇక చివరి అడుగులో ఏ జట్టు ముందడుగు వేస్తుంది. ఏ జట్టు బోల్తా పడుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇక ఈ వరల్డ్ కప్ టోర్నీలో వరస విజయాలతో అదరగొడుతున్న టీమ్ ఇండియా సొంతగడ్డపై ప్రపంచకప్ ను గెలుచుకొని 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భావిస్తుంది. అయితే ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో అటు ఆతిథ్య టీమిండియానే హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతుంది అనడంలో సందేహం లేదు.

 ఈ క్రమంలోనే మ్యాచ్కి ముందు మీడియా సమావేశంలో మాట్లాడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ చేపట్టిన నాటి నుంచి కూడా ఈరోజు కోసం ఎదురుచూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ టోర్నీలో మేము మెరుగైన ప్రదర్శన కనబరిచాము. ఇక ఫైనల్ లోను అదే జోరును కొనసాగిస్తామని ఆశిస్తున్నా. ఇక ఆస్ట్రేలియాను తేలిగ్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ టీమ్స్ లో ఆస్ట్రేలియా కూడా ఒకటి. టోర్నీలో 8 మ్యాచ్ లు గెలిచి ఫైనల్ కు కూడా వచ్చింది. ఆస్ట్రేలియా ఏం చేయగలదో మాకు తెలుసు అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాని ఎదురుకునేందుకు మా ప్రణాళికలు మాకు ఉన్నాయి అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: