ఫైనల్ మ్యాచ్.. రాత్రంతా స్టేడియం బయటే ప్రేక్షకులు?

praveen
ప్రస్తుతం ఇండియా వేదికగా 2023 వన్డే వరల్డ్ కప్ ఎడిషన్ జరుగుతుంది. ఇక ఈ ప్రపంచ కప్ టోర్నీ తుది దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. నేడు జరగబోయే ఫైనల్ మ్యాచ్ తో ఇక ఈ ప్రపంచ కప్ టోర్నీకి ఎండ్ కార్డు పడబోతుంది. అటు ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య పోరు జరగబోతుంది అని చెప్పాలి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేజియంలో ఇక ఈ ఉత్కంఠ భరితమైన సమరం జరుగుతుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే అటు అంగరంగ వైభవంగా ముగింపు వేడుకలను నిర్వహించడానికి బీసీసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రిటీలు ఈ ముగింపు వేడుకలలో ప్రదర్శన చేయబోతున్నారు అని చెప్పాలి.

 అయితే ఆస్ట్రేలియా భారత్ ప్రధానుల దగ్గర నుంచి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఇక నరేంద్ర మోడీ స్టేడియంకు హాజరై మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించబోతున్నారు. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ ప్రారంభమైన నాటి నుంచి కూడా ఇక కీలకమైన మ్యాచ్లో జరిగే స్టేడియం సమీపంలో ఉండే హోటల్స్ యాజమాన్యాలు.. ఒక్కసారిగా రెంట్స్ భారీగా పెంచేసాయి అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. దీంతో చాలామంది మ్యాచ్ చూడటానికి వచ్చిన వారు కనీసం హోటల్ లో బస చేయలేని పరిస్థితి ఉంది అన్న వార్తలు కూడా వైరల్ గా మారిపోయాయి. ఇందుకు నిదర్శనంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన ఒకటి నిలిచింది.

 మరికొన్ని గంటల్లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అయితే మ్యాచ్ను వీక్షించేందుకు వచ్చిన చాలామంది ప్రేక్షకులు స్టేడియం బయట నిలబడిపోయారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అహ్మదాబాద్ కు చేరుకున్న వాళ్ళు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలోనూ మ్యాచ్ కోసం ఎదురు చూస్తూ ఇక స్టేడియం బయట ఉండిపోయారు.  నరేంద్ర మోడీ స్టేడియం బయట ఫ్యాన్స్ అందరూ కూడా పడిగాపులు కాస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. అయితే ఫ్యాన్స్ అందరు కూడా ఇలా స్టేడియం బయట ఉండడానికి కారణం అక్కడ హోటల్స్ ధరలు ఆకాశాన్ని అంటడమే అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: