వరల్డ్ కప్ ఫైనల్లో.. భారత్ అస్సలు గెలవదు : పాక్ క్రికెటర్

praveen
ప్రస్తుతం సొంత గడ్డమీద వరల్డ్ కప్ ఆడుతూ ఉండడంతో భారత జట్టు 2023 వన్డే వరల్డ్ కప్ ఎడిషన్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. ఇక అంచనాలకు తగ్గట్లుగానే టీమ్ ఇండియా అద్భుతమైన ప్రస్థానం కొనసాగించింది అన్న విషయం తెలిసిందే. వరుస విజయాలు సాధిస్తూ జైత్రయాత్రను కొనసాగిస్తుంది. ఇప్పటివరకు సెమి ఫైనల్ దాకా పది మ్యాచ్లు ఆడిన టీమిండియా  అన్నింటిలో కూడా విజయం సాధించింది. దీంతో ఓటమి ఎరుగని  జట్టుగా కొనసాగుతుంది..

 ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో తప్పకుండా టీమిండియానే టైటిల్ విజేతగా నిలుస్తుందని క్రికెట్ నిపుణులు అందరూ కూడా బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దీనికి కారణం ప్రస్తుతం వరల్డ్ కప్ లో భారత జట్టు చూపిస్తున్న డామినేషనే కావడం గమనార్హం. అయితే భారత జట్టు ఇలా విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించడం చూసి ఎందుకో పాకిస్తాన్ మాజీ ప్లేయర్లకు అస్సలు ఓర్వలేకపోతున్నారు. ఏదో ఒక రూపంలో భారత జట్టు పై తమ అక్కసును వెళ్ళగకుతున్నారు అని చెప్పాలి. ఎంతోమంది పాకిస్తాన్ సీనియర్ ప్లేయర్లు మాజీ ప్లేయర్లు చేస్తున్న ఆరోపణలు కాస్త సంచలనంగా మారిపోతున్నాయి.

 టాస్ ఫిక్సింగ్ చేశారని కొంతమంది.. భారత బౌలర్లకు ప్రత్యేకమైన బంతి అందిస్తున్నారని ఇంకొంతమంది.. పిచ్ వారికి అనుకూలంగా తయారు చేసుకున్నారని మరి కొంతమంది ఇలా చిత్రవిచిత్రమైన ఆరోపణలను తెరమిదికి తీసుకొస్తున్నారు. అయితే ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మొత్తం భారత్ గెలుస్తుంది అని ముక్తకంఠంతో చెబుతున్న వేళ.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ ఫైనల్ గెలిచేందుకు ఆస్ట్రేలియా జట్టుకు అని అర్హతలు ఉన్నాయి. నా అభిప్రాయం ప్రకారం ఆస్ట్రేలియా జట్టు టీమ్ ఇండియాని ఓడించి మరోసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరిస్తుంది అంటూ సోయబ్ మాలిక్ చేసిన కామెంట్స్ కాస్త హాట్ టాపిక్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: