రేపే ఫైనల్.. పిచ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన క్యూరేటర్?

praveen
ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య అక్టోబర్ 19వ తేదీన అంటే రేపే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో.. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అటు ఇరు దేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కాబోయే ఈ మ్యాచ్ కు ముందు ముగింపు వేడుకలు కూడా జరగబోతున్నాయి అని చెప్పాలి.

 అయితే ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎన్నో విషయాలు హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఈ రెండు టీమ్స్ మధ్య గత గణాంకాలు ఎలా ఉన్నాయి అన్న విషయాలను తెలుసుకునేందుకు.. కూడా క్రికెట్ ప్రేక్షకులు ఆసక్తిని కనపరుస్తున్నారు. అదే సమయంలో కొన్ని పాత సెంటిమెంట్లు కూడా తెరమీదికి వస్తూ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ఫుల్ డీటెయిల్స్ కోసం తెగ వెతికేస్తూ ఉన్నారు క్రికెట్ ఫ్యాన్స్.

 అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఫ్రెష్ పిచ్ సిద్ధం చేస్తున్నారా.. లేదంటే ఇదివరకే వాడి పడేసిన పిచ్ పై ఫైనల్ మ్యాచ్ ఉంటుందా అనే విషయం మాత్రం స్పష్టత లేదు. అయితే పిచ్ గురించి ఇక అక్కడి స్టేట్ అసోసియేషన్ క్యూరేటర్ మాట్లాడుతూ.. స్లో బ్యాటింగ్ ట్రాక్ ను సిద్ధం చేస్తున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం భారీ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. ఫైనల్ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన టీం 315 పరుగులు చేసిన దానిని ఎంతో సమర్థవంతంగా డిపెండ్ చేసుకోగలదు. ఇక రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసే జట్టుకు మాత్రం ఈ పిచ్ పై పరుగులు రాబట్టడం కష్టంగా మారుతుంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: