పాకిస్తాన్ జట్టుకి.. కొత్త కెప్టెన్లు వీరే.. ప్రకటన చేసిన బోర్డు?

praveen
ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ ఎంత దారుణమైన ప్రస్థానాన్ని కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరల్డ్ కప్ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ ఎక్కడ అంచనాలను అందుకోలేకపోయింది. మొదట్లో వరుసగా రెండు విజయాలు సాధించి దూకుడు కనబరిచినా.. ఆ తర్వాత మాత్రం వరుస పరాజయాలతో సతమతమైంది ఈ జట్టు.

 ఈ క్రమంలోనే లీగ్ దశతోనే సరిపెట్టుకుంది పాకిస్తాన్. అయితే పాకిస్తాన్ జట్టు దారుణ ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మరి ముఖ్యంగా బాబర్ జట్టును కెప్టెన్గా సమర్థవంతంగా ముందుకు నడిపించడంలో విఫలమయ్యాడు అంటూ ఎంతోమంది పాకిస్తాన్ మాజీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను కెప్టెన్సీ నుంచి తప్పుకొని ఇక బ్యాటింగ్ పై దృష్టి పెడితే బాగుంటుంది అని ఎంతోమంది సలహాలు కూడా ఇచ్చారు. అయితే వరల్డ్ కప్ ముగిసిన వెంటనే బాబర్ కెప్టెన్సీ కి గుడ్ బై చెప్పేస్తాడు అంటూ ప్రచారం జరిగింది. అందరూ అనుకున్నట్లుగానే బాబర్ నిజంగానే కెప్టెన్సీ కి రిటైర్మెంట్ ప్రకటించాడు.

 అయితే ఇక బాబర్ ఇలా కెప్టెన్సీకి రిటైర్మెంట్ ప్రకటించాడో లేదో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిమిషాల వ్యవధి లోని ఇక జట్టుకు కొత్త కెప్టెన్ లో వివరాలను ప్రకటించడం హాట్ టాపిక్ గా మారి పోయింది. ఏకంగా టి20 ఫార్మాట్ కి పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహీన్ ఆఫ్రిది  కెప్టెన్గా వ్యవహరిస్తాడు అంటూ పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే అటు టెస్టులకు షాన్ మసూద్ కి సారధ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపింది. ఇక వన్డే ఫార్మాట్ కి ఎవరు కెప్టెన్ గా వ్యవహరిస్తారు అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అతి త్వరలోనే ఇక ఈ విషయంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: