వరల్డ్ కప్ హిస్టరీలో.. 31 ఏళ్ళ తర్వాత టీమ్ ఇండియా అరుదైన రికార్డు?

praveen
ఈ వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోయింది. ఈ క్రమంలోనే భారత జట్టు ప్రదర్శన పై ప్రశంసలు వర్షం కురిసింది అని చెప్పాలి. ఇలా భారత జట్టు వరుస విజయాలు సాధిస్తున్న.. ఇక టీమ్ ఇండియా అభిమానుల్లో మాత్రం ఒక విషయంపై కాస్త ఆందోళన నెలకొంది. ఏకంగా జట్టులో 5 మంది పేసర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు అని చెప్పాలి. ఇక ఒక్కొక్కరు 10 ఓవర్ల పాటు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.


 అందరూ కూడా మంచి ఫామ్ లో ఉంటూ వికెట్లు పడగొడుతున్నారు. ఈ విషయం పక్కన పెడితే.. ఎవరైనా బౌలర్ గాయపడితే ఇక మిగిలిన ఓవర్లను ఎవరితో వేయిస్తారు అనే విషయంపై చర్చ జరిగింది. ఎందుకంటే టీమిండియాలో పార్ట్ టైం బౌలర్లు కూడా ఎవరు అందుబాటులో లేరు. దీంతో ఎవరైనా గాయపడితే టీమిండియాకు అది ఎదురు దెబ్బ అవుతుంది అంటూ అందరూ అనుకున్నారు.  కానీ ఇటీవల నెదర్లాండ్స్ జట్టుతో జరిగిపోయిన భారత బౌలింగ్ విషయంలో ఉన్న ఆందోళన నుండి అభిమానులకు ఉపశమనం లభించింది.


 ఎందుకంటే నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రెగ్యులర్గా బౌలింగ్ చేసే సిరాజ్, బుమ్రా, షమి కుల్దీప్ యాదవ్, జడేజాలు బౌలింగ్ చేశారు. కానీ వీళ్ళతో పాటు ఇక భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన కోహ్లీ, గిల్, సూర్య, రోహిత్ లాంటి వాళ్లు కూడా పార్ట్ టైం బౌలర్లుగా బౌలింగ్ చేశారు. అంతే కాదు వికెట్లు కూడా దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఒక అరుదైన రికార్డు సృష్టించింది. ఏకంగా 31 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ లో ఇలా ఒక టీం నుంచి తొమ్మిది మంది బౌలర్లను వినియోగించడం ఇదే తొలిసారి. 1992లో న్యూజిలాండ్, 1987 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ జట్లు ఇలా తొమ్మిది బౌలర్లను ఉపయోగించి రికార్డు సృష్టించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: