తొడ కండరాల గాయం.. డబుల్ సెంచరీ వీరుడు దూరం?

praveen
ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ మరింత రసవతరంగా మారిపోయింది. అయితే ఇప్పటికే లీగ్ మ్యాచ్లు ముగింపు దశకు చేరుకున్నాయ్. నేటితో ఇక లీగ్ మ్యాచ్లు ముగుస్తాయి. దీంతో ఇక సెమి ఫైనల్ పోరుకు సమయం ఆసన్నం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమి ఫైనల్ అడుగు పెట్టగా.. నేడు జరగబోయే మ్యాచ్లతో ఇక నాలుగవ స్థానంలో నిలవబోయే జట్టు ఏది అనే దానిపై పూర్తి క్లారిటీ రాబోతుంది. ఇకపోతే ఇలాంటి సమయంలో కొంతమంది ఆటగాళ్లను గాయాలు బెడద తీవ్రంగా వేధిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే.



 ఈ వరల్డ్ కప్ లో మొదట్లో ఓటములతో సతమతమైనా.. ఆ తర్వాత అనూహ్యంగా  పుంజుకుని  వరుస విజయాలతో సెమీఫైనల్ అడుగుపెట్టిన ఆస్ట్రేలియాను..  గాయాల బెడద వేధిస్తుంది. మొన్నటి వరకు  గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ మళ్ళీ జట్టులోకి వచ్చాడు. ఆఫ్గనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓడిపోవడం ఖాయం అనుకొన్న పరిస్థితుల్లో అతను ఒక వైపు తొడ కండరాల గాయం వేధిస్తున్నా మరోవైపు క్రీజు లో నిలబడి విరోచిత పోరాటం చేసి.. డబుల్ సెంచరీ తో జట్టును గెలిపించాడు.


 అయితే కనీసం నడవలేని స్థితిలో ఉన్న మ్యాక్స్వెల్ కు మ్యాచ్ అనంతరం వైద్యులు చికిత్స అందించారు. అయితే అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు అన్నది తెలుస్తుంది. దీంతో బంగ్లాదేశ్ తో మ్యాచ్ కు అతను అందుబాటులో ఉండడట. ఈ క్రమంలోనే మ్యాక్స్వెల్స్ స్థానంలో ఫేస్ బౌలర్ సీన్ అబార్డును జట్టులోకి తీసుకోబోతున్నారు అన్నది తెలుస్తుంది. అయితే ఇప్పటికే బంగ్లాదేశ్ టోర్ని నుంచి నిష్క్రమించింది. ఆస్ట్రేలియా సెమి ఫైనల్ లో అడుగు పెట్టింది. దీంతో ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ నామమాత్రమైన మ్యాచ్ కావడం గమనార్హం. దీంతో మాక్స్వెల్ లాంటి కీలక ప్లేయర్ లేకున్న పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ సౌత్ ఆఫ్రికా తో సెమిస్ లో జరిగే మ్యాచ్ కి మాత్రం ఆస్ట్రేలియా జట్టులో తప్పక మ్యాక్సీ ఉండాల్సిందే. లేదంటే ఎదురు దెబ్బ తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: