టీమిండియాకు బిగ్ షాక్.. హార్దిక్ వరల్డ్ కప్ మొత్తానికి దూరం?

praveen
ప్రస్తుతం 2023 వరల్డ్ కప్ లో భాగంగా వరుస విజయాలతో దూసుకుపోతూ ఓటమి ఎరుగని ప్రస్తానాన్ని కొనసాగిస్తున్న టీం ఏది అంటే అది టీమిండియా అని చెప్పాలి. అయితే ఇలా ప్రత్యర్థులపై పూర్తి ఆదిపత్యాన్ని చెలయిస్తూ వరుస విక్టరీలతో హవా నడిపిస్తున్న టీమ్ ఇండియాకు ఊహించని ఎదురు దెబ్బ.. తగలబోతుందా అంటే ప్రస్తుతం అవును అనే సమాధానమే వినిపిస్తుంది. అయితే జట్టులోని ఆటగాళ్ళందరూ మంచి ఫామ్ లో ఉండడంతో ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా అన్ని మ్యాచ్లలో కూడా బరిలోకి దిగింది టీమిండియా. కానీ బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం ఎదురు దెబ్బ తగిలింది.

 జట్టులో కీలక ప్లేయర్గా స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా చీలిమాండ గాయంతో బాధపడ్డాడు. దీంతో నొప్పితో విలవిలలాడుతూ మైదానాన్ని వీడాడు. దీంతో ఇక ఆ తర్వాత న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ స్థానంలో షమీ, సూర్య కుమార్ యాదవ్ లను జట్టులోకి రీప్లేస్ చేశారు. అయితే ఆ తర్వాత మ్యాచ్లకు అతను అందుబాటులోకి వస్తాడు. మళ్ళీ టీమిండియా పటిష్టంగా మారుతుందని అందరూ అనుకుంటున్న వేళ.. ఇక భారత జట్టుకు ఒక బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం చీలమండ గాయంతో వరల్డ్ కప్ టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పాండ్యా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటున్నాడు. నితిన్ పటేల్ ఆధ్వర్యంలో వైద్య బృందం అతని పర్యవేక్షిస్తుంది. అయితే గాయం మొదట గుర్తించిన దాని కంటే కొంచెం తీవ్రంగా ఉందని వైద్యులు భావిస్తున్నారని.. ఒక బీసీసీ అధికారి చెప్పడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే అతను వరల్డ్ కప్ టోర్నీకి మొత్తం గాయంతో దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: