వన్డేలలో.. అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లు వీళ్లే?

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో ప్రతి మ్యాచ్ లో కూడా అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ప్రతి ఒక్క ప్లేయర్ అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే జట్టు కోసం ఎంత శ్రమించడానికి అయినా సరే సిద్ధమవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బౌలర్లు ఎంతో పరిమితిగా పరుగులు ఇస్తూ.. ఎంతో వైవిధ్యమైన బంతులను సంధిస్తూ అదరగొట్టాలని భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్లో జరిగే ద్వైపాక్షిక సిరీస్ లలో ఇలా భావిస్తే.. ఇక వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మకమైన టోర్నీలో ఎలాంటి ప్రదర్శన చేయాలని ప్లేయర్లు కోరుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 అత్యుత్తమ ప్రదర్శన చేయడమే లక్ష్యంగా అదరగొడుతూ ఉంటారు అని చెప్పాలి. కానీ కొంతమంది ప్లేయర్లు మాత్రం చివరికి దారుణంగా పరుగులు సమర్పించుకొని.. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ల దూకుడు ముందు చేతులెత్తేసి చెత్త రికార్డులను మూట కట్టుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటి ఒక చెత్త రికార్డు నమోదయింది. నెదర్లాండ్స్ ప్లేయర్ బాస్ లి లీడే వరల్డ్ కప్ హిస్టరీలోనే అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.

 ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ల విధ్వంసం ముందు భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్లో ఏకంగా 10 ఓవర్లు వేసిన బాస్ లి లీడే రెండు వికెట్లు తీసి 115 పరుగుల సమర్పించుకున్నాడు. ఇక వరల్డ్ కప్ హిస్టరీలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. అతని తర్వాత 2006లో సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా బౌలర్ మిల్క్ లూయిస్ 10 ఓవర్లలో ఒక వికెట్ తీయకుండా 113 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక 2023లో సౌత్ ఆఫ్రికా తో మ్యాచ్ లో ఆస్ట్రేలియా ప్లేయర్ ఆడమ్ జంపా 10 ఓవర్లలో 113 పరుగులు ఇచ్చాడు. 2016 లో ఇంగ్లాండ్ తో మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్ వహాబ్ రియాజ్ 10 ఓవర్లలో 110 పరుగుల సమర్పించుకున్నాడు. 2019లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ 110 పరుగులు ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: