ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమితో.. ఇంగ్లాండ్ అత్యంత చెత్త రికార్డు?
ప్రపంచ క్రికెట్లో ఉన్న పసికూన టీమ్స్ లలో ఒకటిగా కొనసాగుతున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఏకంగా ప్రపంచ ఛాంపియన్ అయిన ఇంగ్లాండు జట్టును చిత్తుగా ఓడించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఈ విజయంతో ఆఫ్గనిస్తాన్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. ఇన్నేళ్ల వరల్డ్ కప్ చరిత్రలో ఒక్కసారి కూడా ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ పై విజయం సాధించలేదు. కానీ మొదటిసారి ప్రపంచకప్ లో ఐదు సార్లు ఛాంపియన్ అయిన ఇంగ్లాండును చిత్తుగా ఓడించింది ఆఫ్గానిస్తాన్. అయితే ఇలా ఆఫ్గనిస్తాన్ చేతిలో ఘోర ఓటమి చవి చూసిన ఇంగ్లాండు ఒక చెత్త రికార్డును కూడా ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి.
ఏకంగా ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా ఆప్కానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 69 పరుగుల తేడాతో దారుణ ఓటమి చూసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ప్రస్తుతం టెస్టులు ఆడుతున్న 11 జట్లపై వరల్డ్ కప్ లో ఓడిన తొలి జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. 1975లో ఆస్ట్రేలియా చేతి లో 1979లో వెస్టిండీస్, 1983లో న్యూజిలాండ్, భారత్.. 1987లో పాకిస్థాన్, 1992లో జింబాబ్వే, 1996లో శ్రీలంక, సౌత్ ఆఫ్రికా.. 2011 బంగ్లాదేశ్, ఐర్లాండ్ 2023 లో ఆఫ్ఘనిస్తాన్ చేతి లో ఇంగ్లాండు ఓడిపోయింది.