ఒకే ఒక్క గెలుపుతో.. చరిత్ర సృష్టించిన ఆప్ఘనిస్తాన్?
అంచనాలకు మించి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఇక ఇటీవల వరల్డ్ కప్ లో జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటిదే జరిగింది. వరల్డ్ కప్ ఛాంపియన్గా కొనసాగుతున్న టీం ఏదైనా ఉంది అంటే అది ఇంగ్లాండ్ అనే చెప్పాలి. వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన జట్టుగా ఉంది. ఇక టైటిల్ ఫేవరెట్ గా కూడా బరిలోకి దిగింది. ఒకరకంగా ఇంగ్లాండ్ తో మ్యాచ్ అంటే చాలు ప్రత్యర్తి టీమ్స్ కూడా భయపడిపోతూ ఉంటాయి అని చెప్పాలి. అలాంటి ఇంగ్లాండ్ టీం ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోవడాన్ని అసలు నమ్మలేకపోతున్నారు క్రికెట్ ప్రేక్షకులు.
ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ ను మట్టి కరిపించి సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డే ఫార్మాట్లో ఆ జట్టుపై ఆఫ్ఘనిస్తాన్ కు ఇదే తొలి విజయం అని చెప్పాలి. అలాగే టెస్టులు ఆడుతున్న దేశం పై వరల్డ్ కప్ లో గెలవడం కూడా ఆఫ్ఘనిస్తాన్ కు ఇదే మొదటిసారి. వరుసగా 14 ఓటముల తర్వాత విజయం సాధించింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు. అయితే వరల్డ్ ఛాంపియన్గా ఉన్న ఇంగ్లాండ్ పై 2011లో ఐర్లాండ్, 2017లో బంగ్లాదేశ్, ఇప్పుడు 2023లో ఆఫ్ఘనిస్తాన్ లాంటి పసికూన టీమ్స్ గెలిచి చరిత్ర సృష్టించాయి.