ఇండియా vs పాక్ మ్యాచ్.. హాట్ స్టార్ రికార్డులు బద్దులయ్యాయి?
అయితే ఈ రెండు టీమ్స్ ఆసియా కప్ వరల్డ్ కప్ లాంటి టోర్నీలో మాత్రమే తలబడుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా క్రికెట్ ప్రపంచం మొత్తం మరోసారి ఈ హై వోల్టేజ్ మ్యాచ్ వీక్షించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో 1,30,000 మంది ప్రేక్షకుల మధ్య జరిగిన ఈ మ్యాచ్ ప్రతి ఒక్కరికి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచింది అని చెప్పాలి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ అందరూ కూడా టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ వీక్షించారు. అయితే ఎప్పుడు పాకిస్తాన్, ఇండియా మ్యాచ్ జరిగిన కూడా వ్యూయర్షిప్ రికార్డులు బద్దలు అవ్వడం జరుగుతూ ఉంటుంది.
ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్లో కూడా ఏకంగా రికార్డు స్థాయి వ్యూయర్షిప్ నమోదయింది అని చెప్పాలి. దీంతో రికార్డులు నెలకొల్పాలన్న వాటిని తిరగరాయాలన్న కేవలం ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కే సాధ్యమని మరోసారి రుజువు అయింది. పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ ను 3.1 కోట్ల మంది వ్యువర్స్ చూశారని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రకటించింది. ఇండియా ఆడే ఇంటర్నేషనల్ మ్యాచ్ లను ఇన్ని కోట్ల మంది హాట్ స్టార్ లో చూడటం ఇదే తొలిసారి.. ఈ ఘనత కేవలం ఇండియన్ ఫ్యాన్స్ కే సాధ్యమవుతుందని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.