వారెవ్వా.. ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ?

praveen
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లెజెండరీ ప్లేయర్ అన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఎవరో అభిమాని గొప్పగా చెప్పుకోవడం కాదు అతను సాధించిన రికార్డులు చూస్తే సగటు క్రికెట్ ప్రేక్షకుడి నోటి నుంచి కూడా మొదట ఇదే మాట వినిపిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు ఏ క్రికెటర్ కి సాధ్యం కాని రీతిలో ఎన్నో అరుదైన రికార్డులు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ.. ఇంకా రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు. అతను అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి పుష్కరకాలం గడిచిపోతున్న ఇంకా భారత జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాడిలాగా ఇంకా ఏదో నిరూపించుకోవాలి అనే కసి అతనిలో ప్రతి మ్యాచ్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది.


 100 రెడ్ బుల్స్ తాగి అతను మైదానంలోకి బరిలోకి దిగుతాడేమో అనేంతలా అతనిలో ప్రతి మ్యాచ్లో కూడా ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఎప్పుడు ఎంతో దూకుడుగా కనిపించే విరాట్ కోహ్లీ ఆటలోనూ అదే దూకుడు కొనసాగిస్తూ పరుగుల వరద పారిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇప్పటికే దిగ్గజ ప్లేయర్స్ క్రియేట్ చేసిన రికార్డులను అలవోకగా బద్దలు కొట్టిన కోహ్లీ ఇక ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కూడా మరో అరుదైన రికార్డును సాధించాడు అని చెప్పాలి. ప్రపంచకప్ హిస్టరీలో టీమిండియా బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. క్రికెట్ దికజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.



 భారత జట్టు తరఫున వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు అని చెప్పాలి. వన్డేలు టీ20 లలో కలిపి 2279 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. అయితే ఇప్పటివరకు భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు  ప్రపంచ కప్ టోర్నీలలో సచిన్ 2278 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.  ఇక ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్న కోహ్లీ సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. కాగా ఇటీవలే ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో విరాట్  52 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: