భారత్ కి ఇది గడ్డుకాలమే... స్టార్ ప్లేయర్ దూరం అంటే మాటలా?

praveen


టీమిండియా స్టార్ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఆరోగ్య పరిస్థితి గురించి మీరు వినే వుంటారు. మంచి ఫామ్‌లో ఉన్న తరుణంలో ఈ స్టార్‌ ప్లేయర్‌ ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేస్తాడని ఒకవైపు అభిమానులు, మరోవైపు టీమ్ ఇండియా బోలెడన్ని పెట్టుకున్నారు. అయితే మనోడు ఇప్పటికే తొలి 2 మ్యాచ్‌లకు దూరం కాగా అక్టోబర్‌ 14న పాకిస్థాన్‌-భారత్‌ మధ్య జరిగే హై ఓల్టేజ్‌ మ్యాచ్‌కు కూడా గిల్‌ దూరం కానున్నాడనే వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. దాంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.

ఇకపోతే గత కొద్ది రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న గిల్‌.. ప్లేట్‌ లెట్స్‌ స్వల్పంగా తగ్గిపోవడంతో చెన్నైలోని కావేరీ హాస్పిటల్‌లో చేరారు. ప్రస్తుతం గిల్‌ వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌ కోసం టీమిండియా న్యూఢిల్లీకి బయల్దేరగా గిల్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ చెన్నైలోనే ఉండిపోయాడు. ప్లేట్‌ లెట్స్‌ కౌంట్‌ పెరిగాక అతను తిరిగి వస్తాడని అంతా అనుకుంటున్నారు. అయితే గిల్‌ పూర్తిగా కోలుకునేంత వరకు టీమిండియాతోనే ఉండాలని నిర్ణయించకున్నాడని, అతను విశ్రాంతి కోసం ఇంటికి వెళ్లేందుకు కూడా ఇష్టపడలేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

ఈ క్రమంలోనే గిల్ ఢిల్లీకి వెళ్లలేదని, చెన్నైలో ఉంటూనే చికిత్స పొందుతాడని బీసీసీఐ బులెటిన్‌ విడుదల చేసింది. అయితే అందరూ అనుకున్నట్టుగా శనివారం పాకిస్థాన్‌తో జరిగే హై ఓల్టేడ్‌ మ్యాచ్‌లోను గిల్ ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. అఫ్ఘానిస్తాన్‌తో మ్యాచ్‌ తర్వాత పాక్‌తో మ్యాచ్‌కు ముందు రెండు రోజులు గ్యాప్‌ ఉండటంతో గిల్‌ పూర్తిగా కోలుకుంటాడని భారత క్రికెట్‌ అభిమానులంతా ఆశిస్తున్నారు. శనివారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో గిల్ ఫిట్‌గా ఉంటాడని అంతా భావించే సమయంలో మళ్లీ ఆస్పత్రిలో చేరడం ఇపుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. డెంగ్యూ నుంచి కోలుకోవడానికి కనీసం రెండు వారాలు పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అంటే గిల్ వచ్చే వారం ప్రారంభంలో మాత్రమే  తిరిగి బరిలోకి దిగగలడని భావిస్తున్నారు. చూడాలి మరి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: