బాబర్ కు చెక్ పెడుతున్న గిల్.. అత్యుత్తమ ర్యాంక్?
ఇలా ఇటీవల కాలంలో టీమిండియాలో మూడు ఫార్మాట్ల ప్లేయర్గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఇలా అదిరిపోయే ప్రదర్శన చేస్తున్న గిల్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటిస్తున్న ర్యాంకింగ్స్ లో కూడా తన స్థానాన్ని అంతకంతకు మెరుగుపరుచుకుంటూ దూసుకుపోతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే పాకిస్తాన్తో మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన గిల్.. తన కెరీర్ లోనే అత్యుత్తమ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఇటీవల ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే యంగ్ బ్యాట్స్మెన్ గిల్ ఏకంగా రెండవ స్థానానికి చేరాడు.
అయితే ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో కొనసాగుతున్న బాబర్ అజాం స్థానానికి ఇక గిల్ త్వరలో ఎసరు పెట్టేలాగే కనిపిస్తున్నారు. అయితే గిల్ తో పాటు టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లు కూడా టాప్ టెన్ బ్యాట్స్ మెన్ లిస్టు లోకి చేరిపోయారు అని చెప్పాలి. కోహ్లీ రెండు స్థానాలు మెరుగుపరచుకొని ఎనిమిదవ స్థానానికి చేరుకోగా.. రోహిత్ శర్మ రెండు స్థానాలు ఏగబాకి తొమ్మిదవ స్థానంలో నిలిచాడు. అయితే దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఇలా ముగ్గురు భారత బ్యాట్స్మెన్లు టాప్ టెన్ లో ఉండడం ఇదే తొలిసారి అని చెప్పాలి. అయితే తన బ్యాడ్ తో చెలరేగిపోతున్న గిల్ రానున్న రోజుల్లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకోవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.