నేను క్రికెటర్ అయినందుకు సిగ్గు పడుతున్న : గౌతమ్ గంభీర్

praveen
ఒకప్పుడు భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉంటూ రెండు వరల్డ్ కప్ లు అందించిన మహేంద్ర సింగ్ ధోనీకి ఇక ఇండియన్ క్రికెట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ధోనీకి ఉన్న క్రేజ్ దృశ్య ఇక భారత క్రికెట్లో ఎంతోమంది ప్రతిభగల ఆటగాళ్లకు ఊహించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.  ఇక అలాంటి వారిలో గౌతం గంభీర్ కూడా ఒకరు. ఓపెనర్ గా అతను భారత జట్టుకు ఎనలేని సేవలు అందించాడు. ఇక మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో 2007 వరల్డ్ కప్ తో పాటు 2011 వరల్డ్ కప్ గెలవడంలో గౌతం గంభ కీలక పాత్ర అని చెప్పాలి.

 కానీ ధోని అనే ఒక మాయలో మునిగిపోయిన భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా గౌతమ్ గంభీర్ ప్రతిభను గుర్తించలేకపోయారు అని చెప్పాలి ఈ క్రమంలోనే ఇదే విషయంపై గంభీర్ ఎప్పుడు ధోని విషయంలో కాస్త ఆగ్రహంతో ఉంటాడు. ఇక ధోనిని విమర్శించడమే పనిగా పెట్టుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడు ముక్కు సూటిగా మాట్లాడుతూ దూకుడుగా ఉండే గౌతమ్ గంబీర్ ఇప్పటివరకు ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా తన వివాదాస్పద వ్యాఖ్యలకు చెక్ పెట్టకుండా సోషల్ మీడియాలో ఎప్పుడూ తన పోస్టులతో సెన్సేషన్ సృష్టిస్తూ ఉంటాడు.

 అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ లో 58 టెస్టులు, 147 వన్ డేలు, 37 t20 మ్యాచ్ లు ఆడాడు. మొత్తంగా పదివేలకు పైగా పరుగులు చేశాడు. ఇందులో పది సెంచరీలు 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీమిండియా కు తాత్కాలిక కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ లలో ఒకడిగా కొనసాగుతున్నాడు  క్రికెట్ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున ఢిల్లీ నుండి ఎంపీగా గెలిచారు. అలాంటి గంభీర్ ఇటీవలే షాకింగ్ కామెంట్స్ చేసాడు. నా జీవితంలో నేను సిగ్గుపడే విషయం ఏంటంటే నేను క్రికెటర్ కావడమే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు గౌతం గంబీర్. అయితే టీమిండియా మ్యాచ్ విన్నర్ లలో ఒకడైన గంబీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఫ్యాన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు. అతనికి తగిన గుర్తింపు రాకపోవడంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటాడు అని కొంతమంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: