ఓరినాయనో.. ఒక్క సినిమాకు రూ.210 కోట్ల.. ఇది నిజంగా రికార్డే?

praveen
2023 తమిళ భాషా యాక్షన్ కామెడీ చిత్రం జైలర్ ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూలు చేసి భారీ విజయం సాధించింది. దీనిని 200 నుంచి 240 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో మోహన్‌లాల్, డాక్టర్ శివరాజ్ కుమార్ కూడా అతిధి పాత్రలలో నటించారు. ఈ నేపథ్యంలోనే సన్ పిక్చర్స్ చైర్మన్ కళానిధి మారన్ రజనీకాంత్‌కు చెక్కు అందజేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది. ఈ చెక్కు విలువ రూ.100 కోట్లని, సినిమా లాభాల్లో భాగమని సమాచారం. అంటే జైలర్ సినిమాకు రజనీకాంత్ మొత్తం రూ.210 కోట్లు సంపాదించాడు. 110 కోట్లు అతను మామూలు పారితోషికంగా పుచ్చుకున్నాడు. అంటే మొత్తంగా చూసుకుంటే ఈ తమిళ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా కంటే రూ.10 కోట్లు ఎక్కువ.
ఈ వార్తతో రజనీకాంత్ అభిమానులు థ్రిల్ అయ్యారు. అతని విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. జైలర్‌ దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ కూడా ఈ మూవీ సక్సెస్ తో పండుగ చేసుకుంటున్నాడు. ఇకపోతే ఇప్పటికీ కోలీవుడ్‌లో రజనీకాంత్‌ నెం.1 స్టార్‌ అని జైలర్‌ విజయం నిరూపించింది. వరుస ఫ్లాపుల తర్వాత కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలనని రజనీకాంత్ చూపించాడు. జైలర్ అనేది అతని సూపర్ స్టార్‌డమ్, హిట్ సినిమాని అందించగల అతని సామర్థ్యాన్ని గుర్తు చేస్తుంది.
రజనీకాంత్ జైలర్ సినిమాలో చూపించిన నటన బాగా హైలెట్ అయింది అని చెప్పవచ్చు. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి చాలామంది ఆఫీసుల నుంచి సెలవులు కూడా తీసుకున్నారు. యోగి బాబు, సునీల్, రమ్యకృష్ణ, తమన్నా వంటి స్టార్ యాక్ట్రెస్ ఇందులో మంచి ప్రదర్శన కనబరిచి బాగా ఆకట్టుకున్నారు.
ఈ సినిమాలో ముత్తువేల్ పాండియన్ అనే రిటైర్డ్ పోలీసు అధికారిగా రజనీకాంత్ నటించాడు. గ్యాంగ్‌స్టర్ వర్మన్ చేతిలో హత్యకు గురైన తన కుమారుడు, ఏసీపీ అర్జున్‌ను కోల్పోయిన తండ్రిగా ఈ రోల్ చాలా చక్కగా పోషించాడు. ముత్తువేల్ ప్రతీకారం తీర్చుకుంటాడు, వర్మన్ మనుషులను వెంబడిస్తాడు. అర్జున్ ఇంకా బతికే ఉన్నాడని, అతన్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడని వర్మన్ వెల్లడిస్తాడు కాని ముత్తువేల్ చివరికి అతనిని చంపేస్తాడు. అర్జున్ డబ్బు కోసం తన తండ్రిని చంపడానికి సిద్ధపడిన అవినీతిపరుడైన పోలీసు అధికారి అని కూడా ముత్తువేల్ తెలుసుకుంటాడు. చివరికి, ముత్తువేల్ తన కొడుకు, అతని కీర్తి రెండింటినీ కోల్పోయిన దుఃఖంలో మిగిలిపోతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: