క్లీన్ స్వీప్ పై కన్నేసిన టీమ్ ఇండియా.. నేడే చివరి టీ20?
కాగా అక్కడ మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది టీం ఇండియా. ఇక మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్లలో గెలిచి సత్తా చాటింది అని చెప్పాలి. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా ఇక సిరీస్ ను కైవసం చేసుకుంది. ఒకవైపు బౌలింగ్ విభాగం మరోవైపు బ్యాటింగ్ విభాగం కూడా మంచి ప్రదర్శన చేయడంతో ఐర్లాండ్ టీమిండియా ముందు నిలవలేక పోతుంది. కనీస పోటీ ఇవ్వలేక పోతుంది. అయితే ఇక నేడు మూడో టి20 మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే పసికూన టీం పై ప్రతాపం చూపిస్తున్న టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ పై కన్నేసింది.
ఈ క్రమంలోనే నేడు జరగబోయే మ్యాచ్లో గెలిచి క్లీన్ స్వీప్ చేసి ఇక ఐర్లాండ్ పర్యటనను ముగించుకోవాలని భావిస్తుంది బుమ్రా సేన. కాగా చివరి మ్యాచ్ లో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది ఐర్లాండ్ అయితే ఇప్పటికే సిరీస్ లో విజయం సాధించిన నేపథ్యంలో ఇక మూడవ టి20 మ్యాచ్ లో భారత జట్టులో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. బెంచ్ కి పరిమితమైన ఆటగాళ్లకు మూడో టి20లో అవకాశం ఇస్తారన్నది తెలుస్తోంది. ఆవేశ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, షాదాబ్ లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే మూడో టి20 మ్యాచ్ కు కూడా వరుణ గండం ఉంది అన్నది తెలుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.