టార్గెట్ ఐపీఎల్ 2024.. లక్నో టీంలోకి ఎమ్మెస్కే ప్రసాద్?
ఇటీవల కాలంలో మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కొన్ని జట్లు భారీ అంచనాలతో బరిలోకి దిగినప్పటికీ ఇక అంచనాలను అందుకోలేక పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నాయని చెప్పాలి. ఇక ఇలాంటి వాటిలో లక్నో జట్టు కూడా ఒకటీ. గుజరాత్ టైటాన్స్ ఎప్పుడైతే ఐపీఎల్లోకి అడుగు పెట్టిందో.. అదే సమయంలో లక్నో కూడా అడుగు పెట్టింది. కానీ గుజరాత్ మొదటి ప్రయత్నంలోనే టైటిల్ గెలిస్తే లక్నో కి టైటిల్ గెలవడం అనేది ఇంకా కలగానే మిగిలిపోయింది. మంచి ప్రదర్శన చేస్తున్న ఇక నాకౌట్ మ్యాచ్లలో మాత్రం తేలిపోతుంది. ఈ క్రమంలోనే 2024 ఐపీఎల్ సీజన్ లో ఎట్టిపరిస్థితుల్లో టైటిల్ గెలవాలని ఆలోచనలో ఉంది లక్నో సూపర్ జెయింట్స్.
ఈ క్రమంలోనే ఇక జట్టులో కీలకమైన మార్పులు చేయాలని అనుకుంటుంది అని చెప్పాలి ఇక ఇటీవల జట్టు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. లక్నో జట్టుకు వ్యూహాత్మక సలహాదారుగా టీమిండియా మాజీ ఆటగాడు మాజీ సెలెక్టర్ ఎంఎస్కె ప్రసాద్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది జట్టు యాజమాన్యం. ఎంఎస్కే ప్రసాద్ కి ఇప్పటికే జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిద్యం వహించారు. సెలెక్టర్ గానూ అద్భుత విజయాలను సాధించారు. అతని అపారమైన అనుభవం మా జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. యంగ్ ప్లేయర్లను తెరమీదకి తీసుకురావడంతో అటు మా టీమ్ ని ఎదుగుదలకు కూడా ఆయన ఉపయోగపడతారు అని లక్నో ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో తెలిపింది.