టి20 క్రికెట్లో కొత్తరూల్స్.. కేవలం ఆ టోర్నీలో మాత్రమే?

praveen
ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో అటు టి20 లీగ్ ల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే  ఆయా దేశాల క్రికెట్ బోర్డులు నిర్వహించే టి20 లీగ్లను ప్రపంచ క్రికెట్లో ఐసీసీ విధించిన రూల్స్ ఉంటాయి. అదే సమయంలో టోర్నీని మరింత రసవత్తరంగా  మార్చేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త రూల్స్ తీసుకువస్తూ ఉంటాయి ఆయా దేశాల క్రికెట్ బోర్డులు. ఈ క్రమంలోనే బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ అనే రూల్ ని తీసుకువచ్చారు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఈ రూల్ అంతర్జాతీయ క్రికెట్లో లేకపోయినప్పటికీ అటు బీసీసీఐ మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్స్ తీసుకువచ్చి ఐపీఎల్ టోర్నిని మరింత రసవత్తారంగా మార్చింది.  అయితే అచ్చం బిసిసిఐ తరహా లోనే మరికొన్ని క్రికెట్ బోర్డులు కూడా ఆయా దేశాల తరఫున జరుగుతున్న టి20 లీగ్లలో ఇక ఇలాంటి సరికొత్త రూల్స్ తీసుకురావడం చేస్తూ ఉన్నాయ్. అయితే బిసిసిఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలోనే అటు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కరేబియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తూ ఉంది.  ఈ లీగ్ లో భాగంగా అటు స్లో ఓవర్ రేట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

 స్లో ఓవర్ రేట్ తో బౌలింగ్ చేస్తే ఇన్నింగ్స్ 20వ ఓవర్లో ఒక ఫీల్డర్ను గ్రౌండ్ బయటకి పంపించానున్నారు. అయితే బయటికి ఎవరిని పంపాలి అనే విషయం మాత్రం ఆ జట్టుకు కెప్టెన్ గా ఉన్న ఆటగాడు నిర్ణయిస్తారు. అయితే మిగతా ఫీల్డర్లలో ఆరుగురు 30 యార్డ్స్ సర్కిల్ లోనే ఉంటారని నిర్వాహకులు పేర్కొన్నారు. మరోవైపు బ్యాటింగ్ టీం ఎక్కువ టైం వేస్ట్ చేస్తే ఇక ఐదు పరుగుల పెనాల్టీ విధించేందుకు కూడా నిర్ణయించారు. అయితే ఇలాంటి రూల్స్ కారణంగా టి20 లలో స్లో ఓవర్ రేట్ కి చెక్ పెట్టేందుకు అవకాశం ఉంటుందని కరేబియన్ ప్రీమియర్ లీగ్ నిర్వాహకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: