అతనొచ్చాడంటే.. సంజుకి జట్టులో చోటు కష్టమే?

praveen
గత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో సంజూ శాంసన్ గురించి తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ యంగ్ క్రికెటర్ కు ఎందుకో మిగతా ప్లేయర్లతో పోల్చి చూస్తే  తక్కువ అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. దీంతో భారత సెలెక్టర్లు సంజూ శాంసన్ విషయంలో వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఎంతో మంది భారత క్రికెట్ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు సంజూ శాంసన్. జట్టులో చోటు కల్పించకపోవడంతో నిరసనలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పాలి.


 అయితే ఇలాంటి సమయంలోనే అటు ఈ యంగ్ ప్లేయర్ కి వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత సెలక్టర్లు తుది జట్టులో ఛాన్స్ ఇచ్చారు. అయితే వచ్చిన అవకాశాన్ని సంజూ శాంసన్ మాత్రం వినియోగించుకోలేకపోతున్నాడు. వరుసగా అవకాశాలు ఇస్తున్న అతను చెప్పుకోదగా బ్యాటింగ్ ప్రదర్శన మాత్రం చేయలేకపోతున్నాడు అని చెప్పాలి. అయితే అతను ఇలాగే ప్రదర్శన చేస్తే ఇక వచ్చే అవకాశాలు కూడా రావు అంటూ ఎంతమంది మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే సంజూ శాంసన్ అవకాశాల గురించి మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా షాకింగ్ కామెంట్స్ చేశాడు.


 ఒకవేళ గాయం నుంచి కోలుకుని కేఎల్ రాహుల్ భారత జట్టులోకి వచ్చినట్లు అయితే అటు సంజూ శాంసన్ కు సెలెక్టరు ఉద్వాసన పలికే అవకాశం ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు ఆకాష్ చోప్రా. ఎందుకంటే సంజూ శాంసన్ తో పోల్చి చూస్తే కేఎల్ రాహుల్ కు అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం ఉంది అంటూ తెలిపాడు. అందుకే జట్టు యాజమాన్యం అతని వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి అంటూ అభిప్రాయపడ్డాడు. అయితే సంజూ శాంసన్ కు ఆసియా కప్ తో పాటు ప్రపంచ కప్ జట్టులో దాదాపు చోటు సాధ్యమే అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే సంజు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడం మాత్రం జట్టులో అతని స్థానాన్ని మరింత ప్రశ్నార్థకంగా మార్చే అవకాశం ఉందని కామెంట్ చేశాడు ఆకాష్ చోప్రా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: