ఏంటీ సంజూ బ్రో ఇది.. లేక లేక ఛాన్స్ వస్తే ఇలానా ఆడేది?

praveen
గత కొన్ని రోజుల నుంచి టీమ్ ఇండియా వెస్టిండీస్ పర్యటనలో బిజీ బిజీగా ఉంది. ఇక ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్లలో సిరీస్ లు ఆడుతుంది. ఇక ఇప్పుడు టి20 సిరీస్ కూడా ప్రారంభమైంది   అయితే వన్డే టెస్ట్ సిరీస్లలో సత్తా చాటి సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా అటు టీ20 సిరీస్ లో మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక టీమిండియా ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇక టి20 జట్టులో స్థానం దక్కించుకున్న సంజూ శాంసన్ ప్రదర్శన విషయంలో ఎంతోమంది అభిమానులు నిరాశ చెందుతూ ఉన్నారు.

 ఎందుకంటే టాలెంట్ ఉన్నప్పటికీ అతనికి సరైన అవకాశాలు రావట్లేదు అంటూ ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ సెలెక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు  ఉద్దేశపూర్వకంగానే అతనిపై వివక్ష చూపుతున్నారు అంటూ ఇక విమర్శలు గుప్పించారు  వెంటనే అతన్ని జట్టులోకి తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. అయితే ఇక ఇటీవల సెలక్టర్లు సంజూ శాంసన్ కి వెస్టిండీస్ తో జరుగుతున్న టి20 సిరీస్లో తుది జట్టులో అవకాశం కల్పించారు. కానీ ఇలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరో సిరీస్లో అతని ఎంపిక చేసేలా సెలెక్టరును ఆకర్షించాల్సిన సంజూ శాంసన్ దారుణంగా విఫలమవుతున్నాడు.

 దీంతో సంజూ శాంసన్ అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టాలేకపోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో అందరూ చర్చించుకుంటున్నారు  వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోయిన సంజూ శాంసన్ ఇక ఇటీవల జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో ఏడు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. భారీ షాట్ కు ప్రయత్నించి స్టంప్ అవుట్ అయ్యాడు సంజూ శాంసన్. అయితే లేక లేక వచ్చిన అవకాశాలను సంజు సద్వినియోగం చేసుకోలేకపోతు ఉండడంతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: