రెండో మ్యాచ్ లోనే.. తిలక్ వర్మ అరుదైన రికార్డ్?

praveen
తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ.. ప్రస్తుతం అందరూ కూడా ఈ యంగ్ క్రికెటర్ గురించి చర్చించుకుంటున్నారు. కారణం అతని నిలకడైన ప్రదర్శన. ఇప్పటికే ఐపీఎల్ లో ఆడటం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఐపీఎల్లో ఛాంపియన్ టీం గా ఉన్న ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న మిగతా ప్లేయర్లు ఎలాంటి ప్రదర్శన చేసిన అతను మాత్రం ఇక మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఉన్నాడు. గత ఏడాది ఐపీఎల్ లో ముంబై టీం మొత్తం విఫలమవుతుండగా.. అటు తిలక్ వర్మ మాత్రం అద్భుతమైన ఫామ్ కనబరిచాడు. ప్రతి మ్యాచ్లో చెప్పుకొదగా ప్రదర్శన చేసి వార్తల్లో నిలిచాడు.


 ఇక ఆ తర్వాత ఈ ఏడాది జరిగిన సీజన్లోనూ తిలక్ వర్మ పరవాలేదు అనిపించాడు. అయితే ఇక సెలక్టర్ల చూపును ఆకర్షించి ఇటీవల భారత జట్టులోకి కూడా వచ్చేసాడు అని చెప్పాలి  ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో  భాగంగా ఆ జట్టుతో జరుగుతున్న టి20 సిరీస్ లో ఆడుతూ ఉన్నాడు తిలక్ వర్మ. అయితే కేవలం ఐపిఎల్ లో మాత్రమే కాదు అంతర్జాతీయ క్రికెట్లో కూడా తన సత్తా ఏంటో చూపిస్తూ ఉన్నాడు. మొదటి మ్యాచ్ లోను మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకున్న తిలక్ వర్మ.. రెండో మ్యాచ్లోనే ఏకంగా అంతర్జాతీయ క్రికెట్లో తన తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.



 అయితే అతను హాఫ్ సెంచరీ చేసినప్పటికీ జట్టు మాత్రం గెలవలేకపోయింది. కానీ తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ మాత్రం ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టి20 లలో రోహిత్ శర్మ తర్వాత తక్కువ వయసులో హాఫ్ సెంచరీ చేసిన రెండవ భారత ఆటగాడిగా తిలక్ వర్మ రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ 2007లో టి20 వరల్డ్ కప్ లో 20 ఏళ్ల 143 రోజుల వయసులో అర్థ శతకం సాధించి రికార్డు సృష్టించాడు. ఇక ఇప్పుడు తిలక్ వర్మ 20 ఏళ్ల 271 రోజులు అర్థ శతకం సాధించాడు అని చెప్పాలి. ఇక వీరిద్దరి తర్వాత రిషబ్ పంత్ 21ఏళ్ళ 38 రోజులకు హాఫ్ సెంచరీ సాధించి.. ఇక ఈ రికార్డు సాధించిన వారిలో మూడో స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: