బుమ్రా రిటైర్ అయితే బెటర్.. ఆసీస్ మాజీ షాకింగ్ కామెంట్స్?

praveen
టీమ్ ఇండియా జట్టులో కీలక ప్లేయర్ గా కొనసాగుతూ ఉన్నాడు జస్ ప్రీత్ బుమ్రా.   అలాంటి కీలక ప్లేయర్ గత కొంతకాలం నుంచి టీమిండియాలో అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది అన్న విషయం తెలిసిందే. దీనికి కారణం వెన్నునొప్పి గాయం బారిన పడటమే. అయితే గాయం బారిన పడిన బుమ్రా తిరిగి మళ్ళీ జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ.. పాత గాయం తిరగబెట్టడంతో చివరికి జట్టుకు దూరమైన పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే వెన్ననొప్పి గాయానికి శాశ్వత పరిష్కారం చూపాలి అనే ఉద్దేశంతో సర్జరీ చేయించుకున్నాడు.

 ఈ క్రమంలోనే దాదాపు పది నెలల నుంచి అటు టీమ్ ఇండియాకు దూరంగానే ఉంటున్నాడు. ఇక ప్రస్తుతం సర్జరీ గాయం నుంచి కోలుకొని ఫిట్నెస్ సాధించే పనిలో బిజీ బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఐర్లాండ్ పర్యటనకు వెళ్లబోయే జట్టును ప్రకటించక బుమ్రా జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడమే కాదు ఇక భారత జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించబోతున్నాడు అని చెప్పాలి. అయితే ఈ ఏడాది ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నిలు ఉన్న నేపథ్యంలో జట్టుకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక ఇటీవల బుమ్రా ఫిట్నెస్ గురించి ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ మెక్ గ్రాత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
 
 బుమ్రా రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుంది అంటూ మెక్ గ్రాత్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే పూర్తిగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించడం కాదు. కేవలం ఏదైనా ఒక ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటిస్తే అతని కెరియర్ సాఫీగా సాగుతుంది అని మెక్ గ్రాత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా అంతర్జాతీయ క్రికెట్ లో ఎక్కువ రోజులు కొనసాగాలంటే.. ఏదో ఒక ఫార్మాట్ నుంచి రిటైర్ కావాలని సూచించారు. అతని తాను పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అతని బౌలింగ్ శైలి భిన్నంగా ఉండడంతో శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆటగాళ్లకు గాయాలు సహజమని.. ఫిట్నెస్ ను దృష్టిలో పెట్టుకొని కెరియర్ లో ముందుకు సాగాలి అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: