వారెవ్వా.. 9 టైటిల్స్ సాధించిన.. ముంబై ఫ్రాంచైజీ?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీ లో ఛాంపియన్ టీం ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా ముంబై ఇండియన్స్ పేరు చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే మిగతా టీమ్స్ తో పోల్చి చూస్తే అతి తక్కువ సమయంలో అటు ఐదు సార్లు టైటిల్ గెలుచుకున్న టీం గా కొనసాగుతుంది ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ సారధ్యంలో ఎంతో విజయవంతంగా ఇక ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. అయితే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ   అంటే కేవలం ఒక టీమ్ మాత్రమే కాదు ఒక బ్రాండ్ అన్నట్లుగా ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి.

 అలాంటి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఎమ్ఐ పేరుతో అటు విదేశీ లీగ్లలో కూడా వివిధ జట్లను కొనుగోలు చేస్తూ ఉండడం గమనార్హం. అయితే కేవలం ముంబై ఇండియన్స్ మాత్రమే కాకుండా ఇతర ఫ్రాంచైజీలు కూడా ఇలా విదేశీ లీగ్లలో భాగమయ్యాయి. అయితే మిగతా ఫ్రాంచైజీలకు అంతగా కలిసి రావట్లేదు. కానీ అటు ఐపీఎల్లో ఛాంపియన్ అయినా ఎమ్ఐ కి మాత్రం మిగతా లీగ్ లలో కూడా అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ క్రమంలోనే మొదటి ప్రయత్నంలోనే ఏకంగా ఎమ్ఐ ఛాంపియన్గా నిలుస్తూ ఉండడం గమనార్హం. అమెరికాలోని డల్లాస్ వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో సైతం  తొలి సీజన్లోనే ఎంఐ న్యూయార్క్ టైటిల్ కైవసం చేసుకుంది.

 ఇటీవల జరిగిన ఫైనల్ మ్యాచ్లో సీటల్ ఓవర్కాస్ పై ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించి టైటిల్ అందుకుంది  ముంబై ఫ్రాంచైజీ. ఇప్పటివరకు ఏకంగా తొమ్మిది టైటిల్స్ సాధించిన ఫ్రాంచైజీగా చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. మేజర్ క్రికెట్ లీగ్ లో ఎమ్ఐ  న్యూయార్క్ టీం గెలుచుకున్న టైటిల్ తో కలిపి 9 టైటిల్స్ గెలుచుకుంది. ఐదు సార్లు ఐపీఎల్ లో.. రెండు సార్లు ఛాంపియన్ లీగ్ లో.. ఒకసారి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో.. మరోసారి మేజర్ క్రికెట్ లీగ్ లో టైటిల్స్ సాధించింది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ. దీంతో ఇక ఎక్కడికెళ్ళిన రాజు రాజే అన్నట్లు. ముంబై ఇండియన్స్ కి ఏ లీగ్ లో ఆడిన తిరుగు ఉండదు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mi

సంబంధిత వార్తలు: