ఓపికగా ఉంటేనే.. గిల్ సక్సెస్ అవుతాడు?

praveen
గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాలో యంగ్ క్రికెటర్ల హవా ఎక్కువగా నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇలా భారత జట్టులో చోటు సంపాదించుకున్న యంగ్ ప్లేయర్లందరూ కూడా తమ సత్తా ఏంటో తక్కువ సమయంలోనే నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలోనే జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు అని చెప్పాలి. ఇలా అండర్ 19 వరల్డ్ కప్ లో అదరగొట్టి ఇక సెలక్టర్లు చూపును ఆకర్షించి భారత జట్టులోకి వచ్చిన క్రికెటర్లలో శుభమన్ గిల్ కూడా ఒకరు అని చెప్పాలి. అయితే టీమిండియాలోకి వచ్చిన తర్వాత రోహిత్ శర్మకు బెస్ట్ ఓపెనింగ్ జోడిగా శుభమన్ గిల్ పేరు సంపాదించుకున్నాడు.

 అంతేకాదు మంచినీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు చేస్తూ ఎన్నో అరుదైన రికార్డులు కూడా సృష్టించాడు. కేవలం ఒక ఫార్మాట్ కి మాత్రమే అతని బ్యాటింగ్ విధ్వంసం పరిమితం కాలేదు. అన్ని ఫార్మాట్లలో కూడా అదరగొడుతూ తనకు తిరుగులేదు అని నిరూపించాడు. ఈ క్రమంలోనే మూడు ఫార్మట్ల ప్లేయర్గా మారిపోయిన శుభమన్ గిల్.. ఇక టీమ్ ఇండియా ఏ ఫార్మాట్లో మ్యాచ్ ఆడిన ఇక చాన్స్ దక్కించుకుంటూ వస్తున్నాడు అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఓపెనర్ గా అదరగొట్టిన శుభమన్ గిల్ మొదటిసారి వెస్టిండీస్ పర్యటనలో మాత్రం తన ఓపెనర్ స్థానాన్ని యంగ్ బ్యాట్స్మెన్ యశస్వి జైష్వాల్ కోసం త్యాగం చేశాడు. ఈ క్రమంలోనే అతను వన్ డౌన్ లో బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు.

 అయితే ఓపెనర్ గా ఇరగదీసిన శుభమన్ గిల్ అటు వన్ డౌన్ లో మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు అని చెప్పాలి. రెండు మ్యాచ్ లలో కూడా సింగిల్ డిజిట్ స్కోర్కె పరిమితం అయ్యాడు. ఈ క్రమంలోనే అతనిపై విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఇలా విండిస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న శుభమన్ గిల్ పై మాజీ ప్లేయర్ వసీం జాఫర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు   వన్ డౌన్లో ఆడాలని గిల్ నిర్ణయించుకోవడం నిజంగా అభినందనీయం. అయితే ఆ స్థానంలో అతని ఆరంభం అనుకున్న విధంగా లేదు. అవకాశాలు వచ్చిన వినియోగించుకోలేకపోయాడు అంటూ వసీం జాఫర్ చెప్పకు వచ్చాడు. అయితే వన్ డౌన్ లో వచ్చిన ప్లేయర్ ఎంతో ఓపికగా ఆడాలి. పిచ్ పరిస్థితులను వేగంగా అర్థం చేసుకోవాలి. అప్పుడే మెరుగ్గా రాణించేందుకు ఛాన్స్ ఉంటుంది అంటూ వసీం జాఫర్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: