చితక్కొట్టుడు అంటే ఇదేనేమో.. ఒకే ఓవర్ లో?
అయితే ప్రతి ఒక్కరు కూడా ఇలా దూకుడుగా ఆడాలి అనుకున్నప్పటికీ కొంతమంది మాత్రం దూకుడుగా ఆడే క్రమంలో విఫలమవుతూ ఉంటారు. ఇంకొంద మంది మాత్రం బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించి ఏకంగా బౌలర్లతో చెడుగుడు ఆడేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎవరైనా క్రికెటర్ ఇలా పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో సూపర్ పెర్ఫార్మన్స్ చేసి ఇక బ్యాటింగ్ విధ్వంసం సృష్టించాడు అంటే అతని పేరు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి.
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ జార్జియా వేర్ హామ్ కూడా సిక్సర్లు ఫోర్ లతో విరుచుకు పడింది. ఇంగ్లాండ్ మహిళా జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్లో జర్జీయా ఒకే ఓవర్ లో 26 పరుగులు చేసింది. లారెన్ బెల్ వేసిన 50వ ఓవర్లో జార్జియా 6, 6, 4, 6, 4 0 బాది ఓకే ఓవర్ లో 26 పరుగులు రాబట్టింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 50 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి.. 282లో పరుగులు చేసింది. అయితే భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండు తడబడింది. దీంతో ఆస్ట్రేలియా మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఆస్ట్రేలియా బ్యాటర్ జార్జియా వేర్ హమ్ బ్యాటింగ్ విధ్వంసం గురించి అందరూ చర్చించుకుంటున్నారు.