వారెవ్వా.. ఒకేసారి టీమ్ ఇండియాకు ముగ్గురు ఆంధ్ర క్రికెటర్లు?
ఇక ఈ టూర్ లో భాగంగా భారత జట్టు బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ తో పాటు మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కూడా ఆడబోతుంది అని చెప్పాలి. ఇకపోతే బంగ్లాదేశ్ తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్ ల కోసం 18 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టు వివరాలను ఇటీవలే బీసీసీఐ ప్రకటించింది. బంగ్లాదేశ్ పర్యటనకు ఫేసర్ రేణుక సింగ్ గాయంతో దూరమైంది. వికెట్ కీపర్ రిచ ఘోష్ ను సెలక్టర్లు పక్కన పెట్టారు. ఇక ఆమె స్థానంలో అసోం యువ వికెట్ కీపర్ ఉమా చెత్రికీ అవకాశం దొరికింది. వెటరన్ స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ కు యువ స్పిన్నర్ శ్రేయంక పాటిల్ కు కూడా అవకాశం ఇవ్వలేదు సెలెక్టర్లు. కానీ బంగ్లాదేశ్ తో పర్యటించే భారత జట్టులో మాత్రం ముగ్గురు ఆంధ్ర అమ్మాయిలు ఎంపికయ్యారు. అనంతపురం కు చెందిన బారెడ్డి అనూష, కర్నూలుకు చెందిన అంజలి శర్వాణి, విజయవాడకు చెందిన ఎస్ మేఘన ఇక భారత జట్టులో ఎంపికయ్యారు అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల నుంచి ఒకేసారి ఇంతమంది జాతీయ జట్టుకు ఎంపిక అవ్వటం మొదటిసారి అని చెప్పాలి.
టీ20 జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, దేవిక వైద్య, ఉమా ఛెత్రి (వికెట్ కీపర్), స్మాన్‌జోత్‌కీపర్ మేఘన, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, అంజలి సరవాణి, మోనికా పటేల్, రాశి కనౌజియా, అనూషా బారెడ్డి, మిన్ను మణి.
వన్డే జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్జ్, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, దేవిక వైద్య, ఉమా ఛెత్రి (వికెట్ కీపర్, అమంజోత్), అమంజోత్ పునియా, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, అంజలి సరవాణి, మోనికా పటేల్, రాశి రాశి కనౌజియా, అనూషా బారెడ్డి, స్నేహ రానా.