వరల్డ్ కప్ ఫైనలిస్ట్ లు ఎవరో.. ముందే చెప్పేసిన ముత్తయ్య మురళీధరన్?

praveen
ఈ ఏడాది భారత్ వేదికగా 2023 వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఈ వరల్డ్ కప్ కోసం కల్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఇటీవల వరల్డ్ కప్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ని కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. దీంతోఎప్పుడు ఏ ప్రత్యర్థిని ఎదుర్కోబోతున్నాము అనే విషయంపై ప్రతి జట్టుకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. దీంతో ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు పదునైన వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి ఆయా జట్లు.

 అయితే వరల్డ్ కప్ కి సంబంధించిన షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఇక ఇప్పుడు ఎంతోమంది మాజీ ఆటగాళ్లు మరోసారి తమ విశ్లేషణలకు పని పెట్టారు. తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అని చెప్పాలి. ఇంకా అటు వరల్డ్ కప్ ప్రారంభం కావడానికి నెలల సమయం ఉన్నప్పటికీ.. ఇప్పుడే వరల్డ్ కప్ లో సెమీఫైనల్ చేరబోయే టీమ్స్ ఏవి.. ఇక ఫైనల్లో తలబడే టీమ్స్ ఏవి అన్న విషయాన్ని కూడా చెబుతున్నారు. అంతేకాదు వరల్డ్ కప్ విజేత ఎవరు అనేవిషయాన్ని కూడా ముందుగానే అంచనా వేస్తున్నారు. ఇదే విషయంపై లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ కూడా తన రివ్యూ ఇచ్చారు.

 2023 వన్డే వరల్డ్ కప్ లో తప్పకుండా ఇంగ్లాండ్, భారత్ జట్లు తలబడతాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే భారత్ స్వదేశంలో ఆడుతుంది కాబట్టి టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నిలుస్తుంది అంటూ అభిప్రాయపడ్డాడు. ఇక ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఏంటో ఆసక్తికరంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబర్ 5వ తేదీ నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. ఇక అక్టోబర్ 5 న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరుగుతుంది అని చెప్పాలి. ఇక అక్టోబర్ 8న భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 15వ తేదీన అందరూ ఎదురుచూసే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: