కెరియర్లో మొదటిసారి స్టంప్ ఔట్.. జోరూట్ అరుదైన రికార్డ్?

praveen
ఇంగ్లాండ్ క్రికెట్లో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా పేరు ఉన్న జో రూట్ గత కొంతకాలం నుంచి జోరు చూపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఇక జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తున్నాడు.  ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఎంతో ప్రతిష్టాత్మకమైన యాషెష్ సిరీస్ లో కూడా తన అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక భారీగా పరుగులు చేస్తూ ఎన్నో రికార్డులు కూడా కొల్లగొడుతున్నాడు జో రూట్. కాగా యాషెష్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా తో జరుగుతున్న తొలి టెస్ట్ లో రూట్ ఏకంగా మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి అదరగొట్టాడు.


 ఈ క్రమంలోనే అతని టెస్ట్ కెరియర్లో 30వ సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఇక తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో 46 పరుగులు చేసి నాథన్ లయన్ బౌలింగ్ లో స్టంప్ అవుట్ అయ్యాడు జో రూట్. అయితే ఇలా స్టంప్ అవుట్ అవ్వడం ద్వారా కూడా ఒక అరుదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. ఎందుకంటే జో రూట్ స్టంప్ అవుట్   అవ్వడం ఇదే తొలిసారి. అయితే విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్లను అధిగమించి టెస్ట్ ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన అనంతరం స్టంట్ అవుట్ అయిన రెండో ఆటగాడిగా జో రూట్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఇప్పుడు వరకు 131 టెస్టులు ఆడిన రూట్ 11,168 పరుగులు చేసి తొలిసారి స్టంప్ అవుట్  అయ్యాడు.


 కాగా ఈ లిస్టులో వెస్టిండీస్ మాజీ ఆటగాడు శివ్ నారాయన్ చందర్పాల్ 11414 పరుగుల తర్వాత స్టంట్ అవుట్ అయి ఈ జాబితాలో ఎక్కువ పరుగులు చేసి స్టంప్ అవుట్  అయిన క్రికెటర్ గా అగ్రస్థానంలో ఉన్నాడు. గ్రేమ్ స్మిత్ 8,800 పరుగులు చేసిన తర్వాత స్టంప్ అవుట్ అయి మూడో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ 8,195 పరుగులు చేసిన తర్వాత స్టంప్ అవుట్ అయి నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 7419 పరుగులు చేసిన తర్వాత మొదటిసారి స్టంప్  అవుట్ అయ్యి ఇక ఈ లిస్టులో ఐదవ స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: