డబ్ల్యూటీసి ఫైనల్ : ఓవల్ లో.. మనోళ్ల రికార్డులు ఎలా ఉన్నాయంటే?

praveen
రెండేళ్లకు ఒకసారి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిలర్ నిర్వహించే డబ్ల్యుటిసి ఫైనల్ మ్యాచ్ ఇక ఈనెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇంగ్లాండులోని ఓవల్ మైదానం ఇక ఈ ఐసీసీ ఫైనల్ మ్యాచ్ కి ఆతిథ్యం ఇస్తూ ఉంది. ఫైనల్ మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా భారత్ జట్లు తలబడబోతున్నాయి అని చెప్పాలి. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు లండన్కు చేరుకుని ప్రాక్టీస్ లో మునిగి తేలుతూ ఉన్నారు. మరికొన్ని రోజుల్లో అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ నుంచి ఫైనల్ మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో పాత గణాంకాలు ఎన్నో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాయి.

 భారత్, ఆస్ట్రేలియా జట్లలో అటు ఓవల్ మైదానం ఎవరికి బాగా కలిసి వచ్చింది. ఎవరు ఎక్కువ పరుగులు చేశారు అనే విషయాలను తెలుసుకునేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ జరగబోయే ఓవల్ మైదానంలో భారత ఆటగాళ్లు గత రికార్డులు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 ఓవల్ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్ గా ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొనసాగుతున్నాడు. ఎందుకంటే మిస్టర్ డిపెండబుల్గా పేరు సంపాదించుకున్న రాహుల్ ద్రవిడ్ ఓవల్ మైదానంలో మూడు టెస్టులు ఆడి 443 పరుగులు చేశాడు. నేటితరంలో ఇదే మైదానంలో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మన్ గా కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు. ఇక్కడ రెండు మ్యాచ్ లు ఆడిన కేఎల్ రాహుల్ 249 పరుగులు చేశాడు. ఇక రిషబ్ పంత్ రెండు టెస్టుల్లో 178 పరుగులు సాధించాడు. కానీ దురదృష్టవశాత్తు ఇద్దరు కూడా ప్రస్తుతం టీమిండియాకు అందుబాటులో లేరు.

 ఇక వీరి తర్వాత ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్ లిస్టు చూసుకుంటే.. రవీంద్ర జడేజా రెండు మ్యాచ్లు ఆడి 126 పరుగులు చేశాడు. అయితే బౌలింగ్ లో కూడా 11 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఒక మ్యాచ్ లో అయితే ఏకంగా 86 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. టీమిండియా  సారధి రోహిత్ శర్మ ఇక్కడ కేవలం ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇక ఇందులో భాగంగా రెండవ ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించాడు. రోహిత్ 127 పరుగులు చేసి అదరగొట్టాడు.  విరాట్ కోహ్లీ ఇక్కడ మూడు మ్యాచ్లు ఆడే 169 పరుగులు సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Etc

సంబంధిత వార్తలు: