ఐపీఎల్ ఫైనల్.. చెన్నైకి పాత సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

praveen
రాజకీయాల్లో సినిమాల్లోనే కాదు అటు క్రికెట్ లో కూడా ఎన్నో సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే అటు ప్లేయర్స్ సెంటిమెంట్లను ఫాలో అయినా అవ్వకపోయినా ఇక ఆయా ఆటగాళ్ల అభిమానులు మాత్రం ఎప్పుడైనా పాత సెంటిమెంట్ రిపీట్ అయిందంటే చాలు ఇక ఒకప్పటి ఫలితమే ఇప్పుడు కూడా రిపీట్ అవుతుందని బలంగా నమ్ముతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ చేరిన నేపథ్యంలో ఒకప్పటి పాత సెంటిమెంట్ 2023 ఐపీఎల్ సీజన్లో నిజమవుతుందే అని అనుకుంటున్నారు అందరు.

 ఇంతకీ ఏం జరిగిందంటే.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2011లో మే 28వ తేదీన వరుసగా రెండవ ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది అన్న విషయం తెలిసిందే. చెన్నై అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ చేరడానికి ముందు ఎలాంటి పరిస్థితులను అయితే ఎదుర్కొందో.. ఇక 2011 లోను అదే జరిగింది. అప్పుడు లీగ్ దశలో టాప్ ప్లేస్ లో బెంగళూరు టీం ఉంటే.. చెన్నై రెండో స్థానంలో నిలిచింది. ఇక మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో బెంగళూరు ను ఓడించిన చెన్నై నేరుగా ఫైనల్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆర్సిబి  క్వాలిఫైయర్ 2లో ముంబై ఇండియన్స్ ఓడించి ఫైనల్ కి వెళ్ళింది.

 ఇక ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును మరోసారి ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కప్ గెలుచుకుంది. అయితే 2023 ఐపీఎల్ సీజన్ లో కూడా చెన్నై ప్రస్థానం అదే విధంగా సాగింది. పాయింట్ల పట్టిక లో టాప్ లో గుజరాత్ ఉంటే క్వాలిఫైయర్ 1 లో గుజరాత్ ని ఓడించింది చెన్నై. ఆ తర్వాత గుజరాత్ జట్టు క్వాలిఫైయర్ 2 లో ముంబై ఇండియన్స్ ఓడించింది. ఇక ఇప్పుడు రెండు జట్లు ఫైనల్లో తలబడుతున్నాయి. దీంతో పాత సెంటిమెంట్ రిపీట్ అయి చెన్నై టైటిల్ గేలుస్తుందని ఆ జట్టు అభిమానులు నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: