ధోని గురించి.. షాకింగ్ నిజం చెప్పిన సీఎస్కే బ్యాటింగ్ కోచ్?

praveen
మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి ఐపిఎల్ సీజన్ అంటూ వార్తలు వస్తున్నాయ్. ఈ నేపథ్యంలో ధోని ఆటను చూడాలని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారూ. దీంతో ఇక సిఎస్కే జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడిన కూడా అక్కడికి భారీగా తరలి వెళ్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇక ఎక్కడ మ్యాచ్ జరిగిన కూడా అక్కడ చెన్నై అభిమానులతో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోతుంది అని చెప్పాలి. ధోని బ్యాటింగ్ చేయడానికి వచ్చే రెండు మూడు బంతులు అయినా సరే ఇక ప్రేక్షకులు చూసి మురిసిపోతున్నారు. అయితే ధోని కాస్త ముందు బ్యాటింగ్ కి వస్తే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు.

 కానీ ధోని మాత్రం చివర్లో కేవలం రెండు మూడు బంతులు మాత్రమే ఉన్నప్పుడు బ్యాటింగ్ కి వస్తూ ఉండటం చూస్తున్నాం. అయితే ధోని ఇలా చివర్లో బ్యాటింగ్ కి రావడం వెనుక కారణం ఉంది అని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ధోని గత కొన్ని రోజుల నుంచి మోకాలి గాయం సమస్యతో బాధపడుతున్నాడు. అయితే ఇక మోకాలి గాయం నుంచి ఇంకా ధోని పూర్తిగా కోలుకోలేదు. ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అందుకే ఎక్కువగా వికెట్ల మధ్య పరుగులు పెట్టడానికి ధోని ఇష్టపడటం లేదు. బ్యాటింగ్ కి కూడా ఆఖరి ఓవర్లలో రావడానికి కారణం కూడా ఇదే అంటూ మైక్ హస్సి చెప్పుకొచ్చాడు.

 ఒకవైపు మహేంద్ర సింగ్ ధోనీని నొప్పి వేధిస్తున్న.. ఇక ఆ నొప్పిని భరిస్తూనే తన పనిని పూర్తి చేస్తున్నాడని.. మైక్ హస్సి చెప్పుకొచ్చాడు. అయితే ధోని విషయంలో మైక్ హస్సి చేసిన వ్యాఖ్యలు నిజమే అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ధోని చాలా మ్యాచ్ లలో లో మోకాలికి బాండేజీ కట్టుకొని లేదా ఐస్ క్యాప్ పెట్టుకుని మ్యాచ్ను కొనసాగించడం చూసాము. ఇక ఈ విషయం గురించి తెలిసి అతని ధోని అభిమానులు అందరూ కూడా మరింత గర్వంగా ఫీల్ అవుతున్నారు. ధోని గాయం పెట్టుకుని ఆడాల్సిన అవసరం లేదు. కానీ అభిమానుల కోసమే కాదు ఆట పట్ల తనకు ఉన్న డెడికేషన్ ఏంటో చూపిస్తున్నాడు అంటూ ఎంతో మంది అభిమానులు కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: