సూర్య కుమార్ బ్యాటింగ్.. గల్లీ క్రికెటర్లా ఉంది : గవాస్కర్

praveen
ఇటీవల ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఒక్కోసారిగా మూడవ స్థానంలోకి దూసుకుపోయింది ముంబై ఇండియన్స్ జట్టు. అయితే ఇక ఈ మ్యాచ్లో అటు ముంబై స్టార్ బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన ఇన్నింగ్స్ అయితే క్రికెట్ ప్రేక్షకులు అస్సలు మర్చిపోలేకపోతున్నారు. ఒక రకంగా బెంగళూరు జట్టు బౌలర్లతో చెడుగుడు ఆడేశాడు సూర్య కుమార్ యాదవ్.

 సిక్సర్లు, ఫోర్ లతో వీర విహారం చేసే 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. ఏకంగా మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ అనే బిరుదును సార్ధకం చేస్తూ మైదానం నలువైపులా కూడా ఎంతో సొగసైన షాట్లతో రెచ్చిపోయాడు సూర్య కుమార్ యాదవ్. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ జట్టు మరో 21 బంతులు మిగిలి ఉండగానే చేదించింది. ఇక ఈ లక్ష్య చేదనలో సూర్య కుమార్ ఇన్నింగ్స్ ఎంతో కీలకంగా మారింది. అయితే సూర్యకుమార్ ఇన్నింగ్స్ గురించి ఇటీవల లెజెండ్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ గల్లీ క్రికెటర్ లాగా ఉంది అంటూ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.

 సూర్య కుమార్ తన కోరిక మేరకు బౌలర్లను డాన్స్ చేయిస్తున్నాడు. ఇలా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మీకు గల్లి క్రికెట్ గుర్తుకు వస్తుంది. నిరంతన సాధన శ్రమతో అతని ఆట చాలా మెరుగుపడింది. ముందుగా లాంగ్ ఆన్,లాంగ్ ఆఫ్ వైపు షాట్ కొట్టి.. ఆ తర్వాత గ్రౌండ్ చుట్టూ బౌండరీలు బాదాడు. ఇక సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ మరో ఎండ్ లో ఉన్న యువ బ్యాట్స్మెన్ నేహాల్ వధేరాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది అంటూ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. కాగా యువ ఆటగాడు వదెరా సైతం 34 బంతుల్లో  52 పరుగులు చేసి అదరగొట్టాడు. కాగా సూర్య కుమార్ జోడి 140 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డు సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: