సచిన్ సలహానే.. నా కెరియర్ ను మరింత పెంచింది : మిథాలీ రాజ్

praveen
భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్ ఒక లెజెండ్ అన్న విషయం తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే భారత క్రికెట్లో సేవలు అందించి ఎంతో అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించారు. ప్రత్యర్థుల గుండెల్లో సింహస్వప్నంలా మారిన సచిన్ ఇక ఎన్నోసార్లు భారత జట్టుకు అద్వితీయమైన విజయాలను అందించారు అని చెప్పాలి. అయితే ఎలా అయితే పురుషుల క్రికెట్లో సచిన్ రెండు దశాబ్దాల పాటు సేవలు అందించారో.. అటు మహిళా క్రికెట్లో కూడా మిథాలీ రాజ్ ఇదే తరహాలో రెండు దశాబ్దాలు భారత క్రికెట్కు ఎనలేని సేవలు చేశారు.

 కేవలం ఒక ప్లేయర్ గా మాత్రమే కాకుండా ఇక భారత మహిళా జట్టుకు సారధ్య బాధ్యతలు చేపట్టి కూడా ఎన్నో మంచి విజయాలను అందించారు మిథాలీ రాజ్. ఇలా ఒకరకంగా చెప్పాలి అంటే సచిన్ కంటే ఎక్కువ రోజులు భారత క్రికెట్లో అంతర్జాతీయ క్రికెట్ కి ప్రాతినిధ్యం వహించారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి సెకండ్ ఇన్నింగ్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మిథాలీ రాజ్. అయితే ఇటీవల తన కెరియర్ ఎదుగుదల గురించి ఈ మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అని చెప్పాలి. లెజెండ్ సచిన్  ఇచ్చిన సలహాతోనే తన కెరియర్ పొడగింపు జరిగిందని భారత మహిళా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ వెల్లడించింది.

 2017 ప్రపంచ కప్ కి ముందు లండన్లో సచిన్ తో జరిగిన సంభాషణతో తన బ్యాటింగ్ శైలి మొత్తం మారిపోయింది అంటూ చెప్పుకోచ్చింది. ఇలా బ్యాటింగ్లో మార్పు తన కెరియర్ మరింత పొడగించుకోవడానికి దోహదం చేసింది అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఇటీవల సచిన్ 50వ జన్మదినం సందర్భంగా ఇక ఆయన భారత క్రికెట్కు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ మిథాలీ రాజ్ మాట్లాడింది అని చెప్పాలి. సచిన్ టెండూల్కర్ తో ఎవరిని పోల్చలేమని.. ఆటకు దూరమైన ఇప్పటికీ ఆటపట్ల సచిన్ ఆరాధన భావంతో ఉంటారు అంటూ చెప్పుకోచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: