ధోని కెప్టెన్సీ అంటే.. చిరాకు వచ్చేది : రాబిన్ ఉత్తప్ప
ధోని మైదానంలో ఎప్పుడు అగ్రసీవ్ గా రియాక్ట్ అవ్వడు.. ఎంతో కూల్ గా ఉంటూ ప్రత్యర్ధులతో మైండ్ గేమ్ ఆడుతూ ఉంటాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ధోని తీసుకునే నిర్ణయాలు కొన్ని కొన్ని సార్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే మాజీ ప్లేయర్లు సైతం ధోని కెప్టెన్సీ గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన భారత మాజీ ప్లేయర్ రాబిన్ ఉత్తప్ప సైతం ధోని కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని కెప్టెన్సీ ని ఎదుర్కోవడం చాలా చిరాకుగా ఉండేది అంటూ రాబిన్ ఉత్తప్ప చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ జరిగినప్పుడల్లా కూడా ఎంతో చిరాకుగా అనిపించేది. ఒక మ్యాచ్లో హేజిల్ వుడ్ బౌలింగ్లో ఫైన్ లెగ్ వైపు ఫీల్డర్లు లేరు. బంతి అవుట్ సైడ్ ఆఫ్ వైపు పడుతుందని అంచనా వేశాను. దీంతో బంతిని డీప్ ఫైన్ లెగ్ కు కొట్టి బౌండరీగా మలిచేందుకు ప్రయత్నాలు చేశాను. కానీ మనకు అలవాటు లేని ప్రాంతంలో షాట్ కొట్టేలా ధోని చేస్తాడు. ఇలా బ్యాట్స్మెన్ ల మైండ్ తో ధోని ఆడుకుంటూ ఉంటాడు. ధోని ఎక్కడైతే ఫీల్డ్ ని పెడతాడో సరిగ్గా బ్యాట్స్మెన్ అక్కడికే బంతిని కొడతాడు. దీంతో క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతూ ఉంటాడు. అందుకే నాకు ధోని కెప్టెన్సీ అంటే చిరాకు వచ్చేది అంటూ రాబిన్ ఊతప్ప చెప్పుకొచ్చాడు.