బెంగళూరు టీంలోకి కొత్త ప్లేయర్.. ఎవరో తెలుసా?

praveen
గత కొంతకాలం నుంచి అన్ని జట్లను కూడా గాయాల బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఒకటి రెండు మ్యాచ్లు మాత్రమే ఆడి గాయం బారిన పడుతూ ఇక పూర్తిగా టోర్నికి దూరం అవ్వటం జరుగుతుంది. అయితే స్టార్ ప్లేయర్లు ఇలా గాయం బారిన పడుతూ దూరమవుతుండడంతో జట్టు వ్యూహాలు మొత్తం తారు మారు అవుతున్నాయి అని చెప్పాలి. అదే సమయంలో స్టార్ ప్లేయర్ల స్థానంలో అతని స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ల కోసం వెతుకులాట ప్రారంభించడం.. కొత్త తలనొప్పిగా మారిపోయింది అని చెప్పాలి.

 అయితే 2023 ఐపీఎల్ సీజన్లో పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా ఇలాంటి ఊహించని షాక్ తగిలింది అన్న విషయం తెలిసిందే. ముంబై తో అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడిన మొదటి మ్యాచ్ లోనే అటు జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న టాప్లీ గాయం బారిన పడ్డాడు. దీంతో ఇక అతను ఐపిఎల్ టోర్నీ మొత్తానికి దూరం అవ్వబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఇక అతని స్థానంలో జట్టులోకి ఎవరిని తీసుకుంటారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే గాయం బారిన పడి ఐపిఎల్ కు దూరమైన ఫాస్ట్ బౌలర్ టాప్లీ ప్లేస్ లో సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ ను పార్నల్ ను ఆర్సిబి జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాలి మడమ గాయంతో ఒక మ్యాచ్ ఆడని రజత్ పాటిదార్ స్థానంలో వైశాఖ్ విజయ్ కుమార్ ను ఎంపిక చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం. కాగా స్టార్ బౌలర్ పార్నల్ ను 70 లక్షలకు.. ఇక వైశాఖ్ విజయ్ కుమార్ ను20 లక్షల బేస్ ప్రైస్ కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కాగా పార్నల్ రాకతో అటు బెంగళూరు జట్టు బౌలింగ్ దళం మరింత పటిష్టంగా మారిపోయింది అని చెప్పాలి. కాగా పార్నల్ ఇప్పటివరకు సౌత్ఆఫ్రికా తరఫున ఎన్నోసార్లు అత్యుత్తమ బౌలింగ్ ఘనంకాలను నమోదు చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: