కెప్టెన్సీ ఇన్నింగ్స్.. తొలి మ్యాచ్ లోనే పూజార సెంచరీ?
అతని ఆట తీరు చూసిన తర్వాత నిజంగా సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో ఇలాగే బ్యాటింగ్ చేయాలేమో అని ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు కేవలం భారత క్రికెట్లో మాత్రమే తన ప్రదర్శనతో అలరించిన చటేశ్వర్ పూజారా ఇటీవల కాలంలో ఇంగ్లాండ్ కౌంటిలలో సైతం ఆడుతూ అదరగొడుతూ ఉన్నాడు. తనలో దాగివున్న ప్రతిభను బయటపెడుతూ అభిమానులందరికీ సరికొత్త పూజారని పరిచయం చేస్తున్నాడు. గత ఏడాది ఇంగ్లాండ్ కౌంటిలలో పాల్గొని సెంచరీల మోత మోగించాడు.
ఇక ఈ ఏడాది కౌంటీలలో సైతం ససెక్స్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను సైతం అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. మరోసారి బ్యాటింగ్లో అదరగొట్టాడు అని చెప్పాలి. ససెక్స్ జట్టు తరఫున బరిలోకి దిగి డర్హంతో జరిగిన మ్యాచ్లో సెంచరీతో చెలరేగిపోయాడు. 163 బంతుల్లోనే 115 పరుగులు చేశాడు. 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో ఆదుకున్నాడు పూజార. దీంతో ఇక మొదటి మ్యాచ్ తోనే పూజారి మరోసారి సెంచరీల ప్రభంజనాన్ని మొదలుపెట్టాడు అంటూ అభిమానులందరూ కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.