దినేష్ కార్తీక్ తెలివికి.. కెప్టెన్ డూప్లెసిస్ ఫిదా?

praveen
ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు దినేష్ కార్తీక్. గతంలో కోల్కతా జట్టులో ఆడిన దినేష్ కార్తీక్ ఇక బెంగళూరు జట్టులోకి వచ్చిన తర్వాత మరింత మంచి ఫామ్ ను కొనసాగిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన అనుభవాన్ని అంతా ఉపయోగించి వికెట్ కీపింగ్ ప్రతిభను కనబరుస్తూ ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు. ఇకపోతే ఇటీవల కోల్కత్తా తో జరిగిన మ్యాచ్లో దినేష్ కార్తీక్ తన తెలివితో ఏకంగా కెప్టెన్ డూప్లెసిస్ ను ఫిదా చేసేసాడు.



 కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా ఉన్న నితీష్ రానా ఔట్ విషయంలో దినేష్ కార్తీక్ చూపించిన స్మార్ట్ నెస్ కి అభిమానులు సైతం మంత్రముగ్దులు అయిపోయారు అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. కోల్కతా ఇన్నింగ్స్ ఆరో ఓవర్ సమయంలో మైఖేల్ బ్రాస్ వెల్  బౌలింగ్ వేసాడు. అయితే ఓవర్ తొలి బంతిని నితీష్ రానా రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్లౌజ్ కి తాకి వికెట్ కీపర్ కార్తీక్ చేతుల్లో పడింది. ఈ క్రమంలోనే బౌలర్ బ్రాస్వెల్ ఎల్బి డబ్ల్యూ అవుట్ గా అప్పీల్ చేశాడు. ఇలాంటి సమయంలోనే తన అనుభవాన్ని ఉపయోగించి స్మార్ట్ గా ఆలోచించాడు. నితీష్ రానా అవుట్ విషయంలో దినేష్ కార్తీక్ తన తెలివిని ఉపయోగించాడు అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే ఎల్పిడబ్ల్యూ అవుట్ కోసం కాకుండా క్యాచ్ కోసం రివ్యూ కి వెళ్ళాడు దినేష్ కార్తీక్. ఇక ఆ తర్వాత థర్డ్ ఎంపైర్ రివ్యూ లో చెక్ చేయగా.. అటు నితీష్ రానా గ్లౌస్ కి బంతి తాగినట్లు తేలింది. దీంతో ఇక ఫీల్డ్ అంపైర్ నితీష్ రానా అవుట్ అయినట్లు ప్రకటించాడు. అయితే ఇలా రివ్యూ విషయంలో పొరపాటు చేయకుండా ఎంతో స్మార్ట్గా వ్యవహరించిన దినేష్ కార్తీక్ ని సహచరులు అభినందించారు. కీపింగ్లో అనుభవం.. ఆ మాత్రం ఉంటుందిలే.. నీ కాన్ఫిడెంట్ కి ఫిదా అంటూ అటు అభిమానులు కామెంట్లు చేయగా.. స్పెషల్ గా కెప్టెన్ డూప్లెసిస్ వచ్చి అతన్ని అభినందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: