ధావన్ అన్నా.. మనకే ఎందుకు ఇట్లా అయితాంది : సంజూ
అటు పంజాబ్ జట్టును కెప్టెన్ గా ఉన్న శిఖర్ ధావన్ 86 పరుగులు చేసి జట్టును గెలిపించుకున్నాడు అని చెప్పాలి. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 197 పరుగులు చేస్తే.. ఇక ఆ తర్వాత లక్ష్య చేదనకు దిగిన రాజస్థానీ టార్గెట్ చేదించలేకపోయింది. దీంతో ఆఖరి వరకు పోరాడినప్పటికీ ఐదు పరుగులు తేడాతో ఓటమిపాలైంది. అయితే ఈ ఓటమి తర్వాత రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ పెట్టిన ఒక ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. పంజాబ్ కెప్టెన్ టీమ్ ఇండియా, సీనియర్ ఓపెనర్ అయిన శిఖర్ ధావన్ తో ఉన్న ఫోటోని పంచుకున్న సంజు.. పాజి మన మధ్య ప్రతిసారి ఇలా ఉత్కంఠ రేపే మ్యాచ్ లు ఎందుకు జరుగుతున్నాయి అంటావు ఒక కామెంట్ చేశాడు. ఈ ట్విట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
అయితే క్రీడలు అన్న తర్వాత గెలుపు ఓటములు సహజమని.. కానీ క్రీడా స్ఫూర్తి శాశ్వతం అంటూ ఇక సంజు పెట్టిన ట్విట్ పై ఎంతోమంది నెటిజన్స్ స్పందిస్తున్నారు అని చెప్పాలి. కాగా ఇప్పటివరకు అటు ఐపిఎల్ లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య 25 మ్యాచ్లు జరిగాయి. ఇక 25మ్యాచ్ లలో రాజస్థాన్ రాయల్స్ 14 గెలిస్తే, పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్లలో విజయం సాధించింది. దీన్ని బట్టి ఇక ఈ రెండు జట్ల మధ్య పోరు ఎంత హోరా హోరీగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు.