ధోని క్రేజ్ మాములుగా లేదు గా..టీవీ కి హారతి ఇస్తున్న అభిమాని?

praveen
మామూలుగా సినిమా హీరోలకి అభిమానులు లేదా భక్తులు ఉంటారు. కానీ సినిమా హీరోలను మించిన అభిమానులను కలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం క్రికెటర్లు మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా కూడా మన ఇండియన్ క్రికెటర్స్ కి అభిమానులు ఉంటారు. మరి ముఖ్యంగా సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి వారికి మంచి మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. వీరికే కాకుండా మహేంద్ర సింగ్ ధోని కి ఉన్న బీభత్సమైన మాస్ ఫాలోయింగ్ చూస్తే మతిపోకుండా ఉండదు. వెనుకబడిన రాంచి ప్రాంతంలో పుట్టి, దేశానికి క్యాప్టెన్ గా మారి ఎన్నో రికార్డులను సాధించి, ఇండియాకు ప్రపంచ కప్ తెచ్చిన మహేంద్ర సింగ్ ధోని చాలా మంది అభిమానిస్తారు, అంతే కాదు పూజిస్తారు కూడా. అంతటి డై హార్డ్ ఫ్యాన్స్ కలిగిన మహేంద్ర సింగ్ ధోని కి మన ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక మహిని ఒక్కసారైనా చూడాలని అనుకునే వారు కోట్లలో ఉంటారు. ఒకవేళ కనిపిస్తే అతని కాళ్ళపై పడి మొక్కుతారు కూడా.


 ఇక ఇప్పుడు ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభమైంది. అయితే ప్రారంభ వేడుకల సమయంలో అర్జిత్ సింగ్ ఒక చక్కటి పాటతో అందరిని అలరించాడు. ఓం దేవా దేవా అంటూ అతడు పాడుతుంటే మధ్య మధ్యలో మహేంద్ర సింగ్ ధోని
బిగ్ స్క్రీన్ పై కనిపించడంతో  అక్కడ ఉన్న లక్షల మంది జనం గట్టిగా అరిచారు. ఈ సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది.


ఇక ఐపీఎల్ 2023 సీజన్ లో తాజాగా లక్నో జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ సందర్భంగా టీవీలో మహేంద్ర.సింగ్ ధోని చూడగానే అతడి విరాభిమాని ఏకంగా టీవీకే హారతి ఇవ్వడం, గంట కొట్టడం వంటివి చేశాడు. ఇలా మహికి హారతిస్తూ పూజ చేస్తున్న వీడియో ఆ కుటుంబంలోని ఒకరు సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. మామూలుగా సినిమా హీరోలకు పాలాభిషేకాలు చేస్తారు లేదా పోస్టర్లు కడతారు పూలదండలు వేస్తారు అయితే క్రికెటర్ కి ఇలా హారతి ఇచ్చేంత అభిమానం ఉండడం నిజంగా ఎంతో గొప్ప విషయం అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: